Tuesday, August 28, 2012

కల నిజమాయె!

మత్తెక్కిస్తున్న మైసూర్ సాండల్ సోప్ వాసనతో అందమైన అంజంతా శిల్పంలాంటి ఆమె పట్టులాంటి పొడవైనకురులు అలా మొహం మీద పడగానే సాంబ్రాణి గుభాళింపులు నాసికానికి తాకి లేచేలోపే కోయిలవంటి స్వరంతో....ఏవండీ! కాఫీ తీసుకోండని ఆమె అంటూంటే, చేతినిండా వేసుకున్న గాజులు మేమేం తక్కువా అంటూ గలగలమంటూ గిలిగింతలు పెడుతుంటే లేచి వేడి వేడి కాఫీ తాగుతూ.... ఆలుచిప్పల్లాంటి కళ్ళతో, నుదుటిపై ఎర్రనిసింధూరంతో, చిన్నిసన్నని పెదవులు పలికి కదిలితే కవ్విస్తాయేమో అని బిత్తర చూపులు చూస్తుంటే, లేతనిమ్మ పండురంగు షిఫాన్ చీర ఆమె తనువుతో పోటీ పడుతుంటే, తనివితీరలేదంటూ తనవైపు లాక్కునేలోపు,,,,,,!!!
ఏవండీ! ఎనిమిదికావొస్తుంది లేచి బ్రష్ చేసుకుని పొయ్యి మీద పెట్టిన కాఫీని వేడిచేసుకుని తాగి తయారై వెళుతూ క్యారేజ్ తీసుకుని వెళ్ళడం మరచిపోకండి. అలాగే పనమ్మాయి వస్తే తనకి కూడా కాఫీ ఇవ్వండి, తలుపు వేసుకోండి అంటూ.....హడావిడిగా చెప్పేస్తూ సల్వార్ సూట్ వేసుకుని చున్నీ కోసం వెతుకుతున్న నన్ను, నా చిన్ని జడను, చేతికున్న వాచ్ & బ్రేస్ లెట్ ని, నుదుటి పైనున్న గుండుసూది మొనంత బొట్టును లేచి కళ్ళజోడు పెట్టుకుని కలలోని లేని అందాలని నాలో వెతుకుతుంటే నాకేం అనిపించదేమో కానీ మా శ్రీవారికి ఏమనిపించి ఉంటుందో మీరంతా ఊహించే ఉంటారనుకోండి. మళ్ళీ నేను చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించడం ఎందుకని ఇలా ఆపేస్తున్నా:-)
హావ్ ఎ నైస్ డే !!!  

11 comments:

 1. సృజనగారూ, చక్కగా రాసారు, ఇకపోతే మగవాళ్ళు ఎలా ఫీల్ అవుతారూ వేచి చూద్దాం.
  మీకు తెలుగుదినోత్సవ శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. సృజన గారూ!
  పై పై మెరుగులు కాలాన్ని బట్టి మారుతుంటాయి..
  కానీ అసలు బంగారం (మనసు) వన్నె ఎప్పటికీ తగ్గదు కదండీ...:-)
  వారు ఇలాగే అనుకుంటారేమో...:-)...
  @శ్రీ

  ReplyDelete
 3. మీ బ్లాగ్ చూసినప్పుడంతా ఇలాంటి స్మృతులు లేని జీవితం వ్యర్థం అనిపిస్తుందండి సృజనగారు. చదివి హాయిగా నవ్వుకునే బ్లాగ్ మీది.

  ReplyDelete
 4. సృజన గారు మీ వారి కలలోని మీ చేతి గాజులంత అందంగా మీ స్మృతులు సవ్వడి చేస్తున్నాయి very very nice

  ReplyDelete
 5. meeru sapari vaara patrika swathi ekkuva chaduvutharu kadhaaaa

  ReplyDelete
 6. కాలం గడిచే కొద్ది బాహ్య సౌందర్యం కంటే మానసిక సౌందర్యానికి విలువ పెరుగుతుందేమో!

  ReplyDelete
 7. Mee Blog MUKHA chitram chaalaa baavundi.

  Bipasha.. mee Abhimaana nati anukuntaanu. (I like her)

  ReplyDelete
 8. Lovely సృజన గారు...
  ఈ హడావిడీ జీవితంలో కాసింత యిలాంటి ఆలోచనలకైనా ఆస్కారం వున్నందుకు అభినందనలు...
  ఆయనేమంటారు Just miss u..:-)

  ReplyDelete
 9. సృజనాత్మకంగా టపాని మలిచారు సృజన గారు..
  మీ సృజనకు సృజనాత్మక స్పందన ఇద్దామని ఇలా..

  ~శ్రీ~

  ReplyDelete