Friday, August 9, 2013

సరసాల మొగుడు-సరదా పెళ్ళాం

అప్పుడెప్పుడో చెప్పాను........ఏవండి! సరదాగా ఓ షికారులేదు, సరసం అంతకన్నా కరువైంది ఈ మధ్య అని, దానికి పర్యవసానంగా మొన్న కారులో షికారుకి వెళదామా అని అడిగారు ఎప్పుడూ ఎనిమిదింటికన్నా ముందురాని మా శ్రీవారు అయిదు గంటలకే ఇంటికొచ్చి.
మా బాస్ కి ఈ విషయం తెలిసో తెలియకో నేను పరిమిషన్ అడిగిన వెంటనే ఇవ్వడం వలన నేను ఇంటికి నాలుగు గంటలకే వచ్చేసాను. మా ఇద్దరి మూడ్ లే కాకుండా అన్నీ కలిసిరావడంతో బయటికి వెల్లడానికి నిశ్చయించుకుని త్వరగా తయారవ్వాలన్న తొందరలో చుడీదార్ వేసుకోబోతుంటే వద్దు వద్దంటూ అప్పుడెప్పుడో ఆయన కొనుక్కొచ్చిన తెల్లని దానిపై చిన్ని వంగపూవులున్న షిఫాన్ చీర కట్టుకోమన్నారు. అలా కోరిన వెంటనే నేను చేయడం పరిపాటే అయినా కాస్త సరదాలు తెలిసిన దాన్ని కదండి..... అందుకే నేను కూడ ఎప్పుడూ ఆ ప్యాంట్ షర్ట్ లేనా అంటూ జీన్స్ వేసుకుని టీ-షర్ట్ వేసుకోండి అన్నాను. నా గొంతులోని గోము తెలిసిన ఏకై వ్యక్తి ఆయన, గొప్పగా ఫీల్ అయిపోయి అలాగే అంటూ అవి ధరించి తలపై ఉన్న నాలుగు వెంటుకల్ని వందసార్లు దువ్వుకుంటూ.......నాతో, ఆ తలకి క్లిప్ పెట్టుకోకు ఓనాలుగు అల్లికలు అల్లుకుని జడవేసుకో దారిలో మల్లెపూలు కొనిస్తానుగా అన్నారు. అమ్మో.....ఏంటి ఈ ప్రణయ ప్రకంపనం అనుకోలేదు ఎందుకంటే మావారి సరసం నాకు తెలుసు కదండి! అదీ కాకుండా మల్లెపూల సీజన్ ఇంకా కొనసాగుతుందిలే అని జడవేసుకుని చీరకుచ్చీళ్ళు సర్దుకుంటూ ఆయన ముందు నిలబడగానే "కట్టుకున్నా అదే చీర పెట్టుకున్నా అవేపూలు" అనే పాటని ఊహించుకుంటూ శోభన్ బాబు వాణీశ్రీని "పొగరుబోతు" సినిమాలో చూసిన లెవెల్ లో ఊహించుకుంటూ అటునుండి అలాగే ఏదైనా సినిమాకి కూడా వెళదామంటూ చెంపను గిల్లాబోతుంటే.....ఆలస్యం ఎందుకు పదండి అంటూ బయలుదేరాము.
నమస్తే సార్ అన్న అపార్ట్మెంట్ వాచ్ మెన్ తో....మల్లేష్ వాడెవడో మొన్న కార్ పై పాన్ ఉమ్మాడు, నిన్న పిల్లలు గీతలు గీసారు నువ్వు సరిగ్గా చూడ్డంలేదు అంటూ లిస్ట్ చదువుతుంటే.....ఇది సెకండ్ షో అయిపోయినా తీరేది కాదని తెలివిగా ఏవండి మార్కెట్లో మల్లెపూల మాలలు అయిపోతాయి పదండి అని మెల్లిగా కన్నుగీటి చేతిపై గిల్లాను. మంచి మూడ్ లో ఉన్న మావారు కార్  స్టీరింగ్ ని స్టైల్ గా తిప్పుతూ రోడ్డున పడ్డారు. నేను గట్టిగా ఊపిరి పీల్చుకుని హమ్మయ్య  అనుకున్నాను.
మాటతప్పని మావారు మల్లె పూలకోసమని మార్కెట్లో దిగి మూరెడు మల్లెలతో పాటు  బేకిరీలో నాకు ఇష్టమని చాకోబార్ ఐస్ క్రీంతో పాటు ఒక కుల్ఫీ కూడా తీసుకుని పూలమాల నాకిచ్చి ప్యాకెట్ దాచేసారు. ఓ అరగంట సిటీలో లాంగ్ డైవ్ చేసి నెక్లెస్ రోడ్ ఎక్కేసరికి అక్కడ ఎక్కడా ప్లేస్ లేదు ప్రశాంతతకి అని తెలిసి కార్ లోనే కూర్చుని కాసేపు కబుర్లాడుకుందాం అనుకున్నారో లేదో కానిస్టేబుల్ ఛలో సాబ్ అంటూ కార్ పై కొట్టాడు. అసలే అతి ఓపికమంతులైన మావారు వాడిని చూడక ముందే నేను నవ్వుతూ అలాగే వెళుతున్నాము అంటూ ఒక నవ్వు నవ్వాను. గేర్ మారుస్తున్న మావారి చేతిపై నేను చేయివేయగానే కూల్ అయిన మైండ్ ఆయనకి ప్యాకెట్ ని గుర్తుచేసింది.
ఓయ్.......ప్యాకెట్ ఇస్తూ కార్ లోనే తినెయ్ కరిగిపోతుంది అన్నారు. నేను ప్రేమగా చూస్తూ ఇంకా మరచిపోలేదన్న మాటా నా సరదాలు ఇష్టాలు అంటూ చాకోబార్ ని విప్పి తినబోతుంటే కరిగి చాకోలేట్ అంతా చీరపై పడ్డం, పెద్ద గుంత వచ్చి కార్ ఎగరి గెంతడం ఒకేసారి జరిగింది. సారీ సారీ అంటూ చీరపై పడిన చాక్లెట్ తో చీరపాడైపోతుందనే కంగారులో వాటర్ బాటిల్ లోని నీళ్ళతో కడుగుతూ పరిసరాలని మరచిన ఈయన్ని పబ్లిక్ గా  పెళ్ళాంతో కూడా సరసమాడకూడదన్న పవర్ పుల్ రూల్స్ తెలిసిన పోలీసు పొగరుగా మాట్లాడుతూ పెనాలిటీ వేసేసరికి...........
...........
...........
ఇంకేం చెప్పినా చప్పగా ఉంటుందని తెలిసిన తెలివైన పాఠకులు మీరు అందుకే.....అక్కడితో ఇద్దరం మూడ్ మారి మారు మాట్లాడకుండా ఇంటికొచ్చి "ఇంటిని మించిన స్వర్గం ఇలలో లేదని" ఇద్దరం వేరు వేరు ట్యూన్స్ లో పాడుకున్నాం :-)  అని చెప్పను రాసి పోస్ట్ చేయనుగాక చేయను!

21 comments:

  1. చాన్నాళకి చక్కని హాస్యమున్న సరసమైన పోస్ట్ తో.....ఆపకండి మీ స్మృతుల సవ్వడిని మారుమ్రోగించండి సృజనగారు.

    ReplyDelete
    Replies
    1. పద్మార్పితా ఇలా నా బ్లాగ్ లో మిమ్మల్ని....అంతా హ్యాపీస్ :-)

      Delete
  2. బాగుందండీ మీ సరస సల్లాప షికారు. చివర్లో ఇంటికే వచ్చారు కదా..:-)

    ReplyDelete
    Replies
    1. అంతే కదండి.....అడవిలోకి వెళ్ళాంటే అవికూడా నరికేస్తున్నారుగా :-)

      Delete
  3. చాల రోజుల తరువాత మీ స్మృతుల సవ్వడివిన్నాం. నవ్వులు విరబూయించారు.

    ReplyDelete
    Replies
    1. అనికేత్...స్మృతులు సవ్వడి చేయాలంటే మైండ్ కి గజ్జెలుకట్టి మనసు నర్తించాలికదా :-)

      Delete
  4. సృజనా ,

    చాలామందికి తెలుసో , తెలియదో కాని హస్యం ఎక్కువగా పండేది ఒక్క శృంగారంలోనే . చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. శృంగారం శృతిమించితే రాగాన్న పడ్తుంది అనేది పాత నానుడి.....రచ్చ రచ్చ అవుతుంది అనేది బ్లాగ్ హిస్టరీ :-)

      Delete
  5. పబ్లిక్ గా పెళ్ళాంతో కూడా సరసమాడకూడదన్న పవర్ పుల్ రూల్స్ తెలిసిన పోలీసు పొగరుగా మాట్లాడుతూ పెనాలిటీ వేసేసరికి....చాలా హాస్యాస్పదంగా ఉంది మీ టపా.. బాగా రాస్తున్నారు. మీ స్వగతాలు పత్రికలకు ఎమైనా పంపుతున్నారా ..లేక బ్లాగులొనే ప్రచురిస్తున్నారా..

    ReplyDelete
    Replies
    1. కేవలం బ్లాగ్ లో మాత్రమే బంధించబడ్డాయి నా స్మృతులు.

      Delete
  6. కాసేపు హాయిగా నవ్వించారు మీ స్మృతులతో.

    ReplyDelete
    Replies
    1. హాయిగా నవ్వేసుకోండి.

      Delete
  7. బాగుంది సరసమూ, హాస్యమూ మీ దైన శైలిలో, ఇలాంటి రచనలు మీ నుండి ఇంకా ఆసిస్తూ...మెరాజ్

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనలే నాకు ప్రేరణలు. ధన్యవాదాలు.

      Delete
  8. బహుకాల దర్శనం :)

    ReplyDelete
    Replies
    1. అవునండి...పనుల ఒత్తిడి.

      Delete
  9. చాలా కాలం తర్వాతా మీ బ్లాగు చూసాను... చాలా బాగుంటాయి మీ కబుర్లు స్మృతులు ... మొత్తానికి ఆ ట్రాఫిక్ పోలీస్ మీ మూడ్ ఆఫ్ చేశాడన్నమాట :)

    ReplyDelete
    Replies
    1. మీరు కూడా అసలు బ్లాగ్ లో రాస్తున్నట్లు లేరు.....ఎలా ఉన్నారు?

      Delete
  10. చాలా బావున్నాయి మీ విశేషాలు...

    ReplyDelete
  11. హ్హ..హ్హ..హ్హ...హ్మ్ srujana గారు నవ్వించెశారు బాగా నవ్వించేశారు...suppper గా రాశారు:-):-):-)

    ReplyDelete

  12. ఏది ఏమైతే నేమి సృజన గారూ .. ఆయన కిష్ట మైన తెల్లని షిఫాన్ చీర కట్టారు. ఆయనతో జీన్సూ - T షర్టు వేయించారు. శుభ్రంగా 'షి' కారు కెల్లారు. చిత్రమేమిటంటే ఓ సస్పెన్సు త్రిల్లర్ లా ముందేం జరిగిందా అని మీ కారు కంటే వేగంతో కుతూహలంగా ముందుకు దుసుకెల్లాం .
    మీ మాటల్లోని చమత్కారం బాగుంది.
    *శ్రీపాద

    ReplyDelete