Thursday, January 21, 2010

మై డార్లింగ్ డ్రాకులా!

ఓసారి నాలుగురోజులు సెలవు తీసుకుని మావారి ఊరెళ్ళానండి....అదేంటని ఆశ్చర్యపోరని నాకు తెలుసులెండి, ఎందుకంటే నేనిక్కడ(వరంగల్) ఆయనక్కడ(విజయవాడ) అని మీకు తెలుసుననే విషయం నాకు తెలుసుగా....
ఇంక అసలు విషయానికి వస్తే....ఆరోజు శనివారం రాత్రి మేమిద్దరం సెకండ్ షో సినిమాకి వెళ్ళాం, మర్నాడు కాస్త ఆలస్యంగా లేచినా పర్వాలేదు అనుకుని హోటల్ లో టిఫిన్ చేసి థియేటర్ వద్దకు చేరుకునే సరికి ఏ తెలుగు సినిమాకి టిక్కెట్లు దొరకలేదు... ఎలా దొరుకుతాయి చెప్పండి అప్పటికి సమయం పది కావొస్తుంది. అయ్యో! నీకు సినిమా చూపించ లేకపోయానే అని బాధపడుతూ వాళ్ళ రూమేట్స్ తో చూసిన సినిమాల గురించి వివరిస్తుంటే తెలిసిందేవిటంటే ప్రక్కన థియేటర్లో "డ్రాకులా" సినిమా ఆడుతుందని అది ఆయనకి చూడాలనివుందని.
సరేలే సినిమాకి భాషావిభేధాలేల అనుకుని ఆ సినిమా హాల్లోకి చేరుకునే సరికి మాలాంటి భాధితులతో హాలు అక్కడక్కడా నిండివుంది. అప్పట్లో నాలాంటి ఆంగ్లభాష అర్థంకాని వారికోసం చిత్రం చూపించడానికి ముందు తెలుగులో చిత్రకధని క్లుప్తంగా చెప్పేవారు. ఆలస్యంగా అడుగిడడం వలన గుండెధైర్యం లేనివారు జాగ్రత్త అన్న ఆఖరి పలుకులు తప్ప మిగిలిన కధని వినలేకపోయాను. ఆ ఏముందిలే మనకున్న సినీ పరిజ్ఞానంతో ఆపాటి కధని అర్థం చేసుకోలేమా అనుకుని శ్రద్ధగా ప్రతి డ్రాకులా డైలాగులు వినసాగాను.తెరపై డ్రాకులా హీరోయిన్ని కొరకడం ఆవిడకి రెండు కోరలు రావడం దాన్ని క్లోజప్ లో చూపిస్తూ ఇంటర్వెల్ వేసిందే తడువు అందరూ లేచి బయటికి వెళ్ళడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి.ఈయనగారు నాకు కూల్ డ్రింక్ తీసురావడానికి బయటికి వెళ్ళి(అది కాదు అనేవిషయం మీకు తెలిసినా అలా అనుకోవడం నా తృప్తి)ఎప్పుడు తిరిగి వచ్చి నా ప్రక్కన కుర్చున్నారో తెలియదు కాని ఆంగ్లభాషే సరిగ్గా అర్థం కాని నేను ఆంగ్లడ్రాకులాలని అర్థం చేసుకోవడంలో లీనమైపోయాను.అప్పుడప్పుడూ ఉలిక్కిపడి చెవులు మూసుకుని అరిచాను అనేవిషయం నాకు తరువాత తెలిసిందిలెండి.
మొత్తానికి చిత్రం చివరిలో రాత్రి అయితే అందరూ డ్రాకులాలుగా మారిపోతారు అనిమాత్రం నా తెలివైన బుర్రకి అర్థమైంది తెరపై చిత్రం అర్థరాత్రి అంతమైంది.పదండి అని ప్రక్కన వున్న ఈయనగారి చేయి పట్టుకుని(ధైర్యం కోసం) లేచిన నాకు ఎదురుగా సారీ రా.. పద వెళదాం అంటూ మావారి ప్రతిరూపం ఆయన వెనుక చేతికికట్టుతో ఎవరిదో తెలిసిన ముఖం. డ్రాకులాలపై పూర్తిగా ప్రేమలో మునిగిన నన్ను వాళ్ళ సామ్రాజ్యంలో కలుపుకోవడానికి ఈయన రూపంలో వచ్చారేమోనని చెప్పడానికి అటుతిరిన నేను అప్రయత్నంగా మీరా అని నోరువెళ్ళపెట్టి చేతులు విధిలించి కుర్చీలో చతికిల పడ్డాను.
విషయం ఏమిటంటే ఇంటర్వెల్ లో బయటికి వెళ్ళి నాలుగు దమ్ములు కొట్టి టాయిలెట్లోకి వెళ్ళిన ఈయనకి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ చేయి టాయిలెట్ తలుపు మద్యలో పడి దెబ్బతగిలిందని తెలిసి అతన్ని తీసుకుని దగ్గర్లోని హాస్పిటల్లో కట్టు కట్టించి తీసుకుని వచ్చారు. హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ థియేటర్లో మా మావయ్య కనిపిస్తే నేను లోపల ఉన్నానని కంగారు పడతానని నాకు ఈవిషయం చెప్పొదని గంటలో వస్తానని చెప్పి వెళ్ళారు. నేను సినిమా చూస్తూ నా ప్రక్కన కూర్చుని నన్ను పలకరించి కూల్ ఢ్రింక్ అందించిన మావయ్యని గమనించలేదు. మావయ్య కూడా సరేలే సినిమా అయ్యాక మాట్లాడవచ్చని సినిమా చుస్తూ మధ్య మధ్యలో నా విన్యాసాలని కూడా తిలకించారన్నమాట.మొన్న పండకి మావయ్య వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం గురించి చెప్పుకుని నవ్వుకున్నది మీతో ఇలా పంచుకుంటున్నానండి.

15 comments:

 1. ఇంకా నయ్యం కేకలు వెయ్యలేదు మధ్యలో చూసి. మీ మావయ్య గారైనా చెప్పివుండవలసింది. పాపం మీ పరిస్తితి.

  ReplyDelete
 2. మీరు చాలా బాగా రాస్తున్నారు అండి. నేను మీ బ్లాగ్ కి ఫిదా అయిపొయా? మీ పేరు నిజంగానే "సృజన" నా ? లేదా మీ సృజనాత్మకత కోసం పెట్టుకున్నారా ..? అయిన మీరు పూర్వాస్రమము లో ఎమైన రచయత? నా ఉద్దేస్యము మీరు రచనలు గట్రా చెస్తారా ? అని. మీరు బ్లాగ్ రాసే విదానం నాకు చాలా నచ్చిందండి. బెంచ్ మీద ఉన్ననేమో మొత్తం మీ మొదటి బ్లాగ్ నుండి చివరి వరకు అన్ని చదివా. లేదు చదివేటట్టు రాసారు.

  ReplyDelete
 3. @ భావనగారు నా పరిస్థితి మీకే అర్థమైందండి....అప్పుడు అరిచి కేకలు పెట్టివుంటే ఎలా వుండేదో పరిస్థితి!!!
  @ నలుగురిలో నాలుగోవాడైన మీకు మీ అభిమానానికి కృతజ్ఞతలు!

  ReplyDelete
 4. మీరు కేక వేసి ఉండరు, తప్పక ఈలవేసి ఉంటారు అవునా....మీ టపా మాత్రం కేక కాదు ఈల:):)

  ReplyDelete
 5. భలేవారండీ మీరు.. సినిమా సగం సేపు పక్కనున్నది ఎవరో గుర్తించలేదన్నమాట.. డ్రాకులా సినిమాలో అంత లీనమైపోయారా :) :)

  ReplyDelete
 6. మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
  kathasv@gmail.com
  jeevani.sv@gmail.com

  మీ,

  జీవని.

  ReplyDelete
 7. ఈ లెక్కన మీరు చాలా దైర్యవంతులు.. అదే నేనైతేనా నేనన్నా కళ్ళుతిరిగి పడిపోతా లేదా నా అరుపులకు ఎదుటివాళ్ళన్నా పడిపోవాలి :)

  ReplyDelete
 8. srujana garu mee shyli baavundi..meer big writer ipotharemo....

  ReplyDelete
 9. ప్రేరణ....ఈలే వేసాను కాని గాలితో కలసి కేకైయింది.
  మధురవాణిగారు....డ్రాకులాతో ప్రేమంటే మాటలటండి:)
  విజయమోహన్ గారు మీ :):) బాగుందండి.

  ReplyDelete
 10. జీవని....చూసానండి.
  నేస్తం....మనం పడడం ఏవిటి ఛీప్ గా ఎదుటివాళ్ళు మన అరుపులకి పడాలి:)
  స్వామిగారు....ధన్యవాదాలండి, అంత సీన్ ఉందంటారా:)

  ReplyDelete
 11. hi srujana garu,
  mi postulanni chala bagunnayi
  chala saradaga vundelaunnaremiru..:)

  ReplyDelete
 12. సృజన గారు మీ టపా చాలా బాగుంది.

  "స్మృతుల సవ్వడి" అని నేను నా బ్లాగుకి పెట్టుకుందామనుకున్నాను. నాకిష్టమైన పేరు అది.

  ReplyDelete
 13. మీ 'డార్లింగ్ డ్రాకులా' కేకండి:)

  ReplyDelete