Friday, December 18, 2009

కాల్చండి కాని ఆలోచించండి!

రింగు రింగులుగా పొగలు వదులుతున్న మావారిని చూసి ఈయనతో ఎలా మానిపించాలి ఈ అలవాటు అని ఆలోచిస్తున్నానే కాని.....ఆ పొగ ఎన్ని సుడులు తిరుగుతున్నాయో అంతకు పదింతలు మనసున సుడిగుండాలై, మెదడులో రింగులై ఆలోచనలు నన్ను తిప్పేస్తున్నాయి!
అప్పుడొచ్చింది నాకు ఒక బ్రహ్మండమైన సూపర్ డూపర్ ఆలోచన, వచ్చిందే తడవు మార్కెట్ కి వెళ్ళి వెతికి వెతికి ఆఖరికి కొనుక్కొనివచ్చాను.తీసుకొని అయితే వచ్చాను కాని ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో కదా అన్న సంశయం మాత్రం నన్ను వీడలేదు,అయినా ప్రయత్నించి చూద్దాం అని నిర్ణయించుకుని సెంటిమెంట్ తో కొడదాం అనుకుని "ప్రేమనగర్" సినిమాలో వాణీశ్రీగారిని తలచుకుని ఆ మహానటి లెవెల్ లో మనం డైలాగులు చెప్పి నటించలేము (ఏ సీన్ అని ఆలోచించి బుర్ర చించుకోకండి...అదే తలకి గాయమై రక్తం వస్తుంటే అది గ్లాసులో పట్టి త్రాగమని హీరో గారికి ఇచ్చే సీన్ అన్నమాట) కాని రాసి పడేద్దాం ఈయనగారు చదువుకుని నాగేశ్వరావుగారిలా ఫీల్ అయిపోతారు అనుకున్నాను....అంత సీన్ లేదు అనుకుంటున్నారా? ప్చ్! ఏంచేయను చెప్పండి??
ఇంతకు ఏం చేసానో మీకు తెలియదుకదా....ఒక అందమైన అమ్మాయి బొమ్మ దాని హృదయం నుండి జ్యోతి వెలుగుతూ సంగీతం వినిపించే లైటర్ ని మావారికి పుట్టినరోజు కానుకగా ఇచ్చాను. అది ఒక్కటీ ఇచ్చి వుంటే బాగుండేది అప్పుడు నాపై వాణీశ్రీగారు పూనారు కదా! నటనరాక రచించాను నేను తెల్ల కాగితముపై ఈ తవిక(నా దృష్టిలో కవిత).......
"మీరు సిగరెట్లు ఎన్నైనా కాల్చండి!
ఈ లైటర్ ని ఉపయోగించండి!
కాల్చిన ప్రతిసారి ఆలోచించండి!
నా హృదయం రగులుతుందని గమనించండి!
మీ పుట్టినరోజున నా ఈకానుకను స్వీకరించండి!"
ఇంత చక్కగా వ్రాసి కవితా ప్రియులైన మావారికి లైటర్ తో పాటు కాగితాన్ని కూడా అందించాను. కవిత చదివి చలించిన(అలా అనుకుంటే నాకు అదో తృప్తి లెండి)మావారు లైటర్ వెలిగిస్తే అందులో నుండి గాలి తప్ప జ్యోతి రాదుగా ఎందుకంటారా! అందులో గ్యాస్ లేదుగా ఆ వస్తువు ఇంపోర్టెడ్ దిగా......ఇది పదేళ్ళ క్రితం నాటి సంగతి! అప్పటి నుండి మావారు ఇప్పటికి వెయ్యిన్నొక్కసారి సిగరెట్టు మానేయడం జరిగింది.దానికి పదింతలు నా తవికని, కానుకని చూసుకుని మురుస్తూ రేపటినుండి మానేస్తాను అని అనడం నేను ఆయనతో మానిపించడానికి ప్రయత్నించడం రొటీన్ అయిపోయింది.
అన్నట్టు డిసెంబర్ 19న మావారి పుట్టినరోజు....అందుకే నా ఈ స్మృతిపదాన్ని మీతో పంచుకున్నది. ఈసారి ఇంకో క్రొత్త ప్రయత్నంతో మావారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.మరిన్ని స్మృతులతో మిమ్మల్ని మరో టపాలో కలుస్తాను.

15 comments:

 1. excellent your tavika. best wishes to your husband pity for your work

  ReplyDelete
 2. మీ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు ముందస్తు అభినందనలు. వర్డు వెరిఫికేషను తీసేద్దురూ!

  ReplyDelete
 3. ముందుగా మీ శ్రీవారికి జన్మదిన శుభాకాంక్షలు.

  మీకవిత భలే వుందండీ. అయినా మీవారికి చెప్పండి, తోడుగా నేనున్నానని. ఈ మధ్య ఎప్పుడో మానేసి మళ్లీ జనవరి ౧ నుంచి మానేద్దామని ఏరోజుకారోజే అనుకుంటున్నాం.
  మీరెంత మంచివారో..లైటర్ ని కూడా బహుమతిగా ఇచ్చారు :) [ వెలిగినా వెలగక పోయినా]

  ReplyDelete
 4. మి కవిత చాల బగుందండి.
  అలాగే పొగరాయుల్లపై నాకుతెలిసిన విషయాలు కొన్ని నా బ్లాగులొ వ్రాసాను మీకు ఇష్టమైతె ఈ లింకుని మీ వారికి చుపించండి.
  http://ramgopal-s.blogspot.com/2009/10/blog-post_20.html

  ReplyDelete
 5. Ramesh & Sirisirimuvva thanks a lot...

  ReplyDelete
 6. బా.రా.రె గారు Thank Q! అలాగైతే మావారితో పాటు మీకు కూడా చూపించాలి NO SMOKING సినిమా సీడీ ని ఈసారి ప్రయత్నంగా:)

  ReplyDelete
 7. రాంగోపాల్ గారు సినిమాతో పాటు ఈ లింక్ ని కూడా జత చేస్తానులెండి. థ్యాంక్సండి!

  ReplyDelete
 8. సృజన గారు మీరు ఇక్కడ చాలా సరదాగా రాసారు కాని , నిజంగా మీరు మీ వారి విషయంలో చాలా బాధపడుతున్నారు కదూ!
  ఆ భాద అనిర్వచనీయం. అది వాళ్ళకు ఎప్పటికి అర్ధం కాదు కాని మీ వారుమిమ్మల్ని త్వరలోనే అర్ధం చేసుకోవాలని... ఆ సంతోష క్షణాలు మీ జీవితంలో త్వరలోనే ప్రవేసిస్తాయని ఆశిస్తున్నాను ....... నేనేమైనా తప్పుక మాట్లాడితే క్షమించండి...

  www.tholiadugu.blogspot.com

  ReplyDelete
 9. ఎంతైనా మీవారి కవితా హృదయాన్ని మెచ్చు కోవాలండి!
  వెయ్యిన్నొక్కసారి మానేయడం మాటలా చెప్పండి!!:)

  ReplyDelete
 10. గెలిచినవారికి గతం ఉంటుంది.
  ఓడినవారికి భవిష్యత్తు ఉంటుంది.
  మళ్ళీ ప్రయత్నించండి.
  All the best. :)

  ReplyDelete
 11. మీ శ్రీవారికి జన్మదిన శుభాకాంక్షలు.

  ReplyDelete
 12. మీ శ్రీవారికి జన్మదిన శుభాకాంక్షలు. All the best in your efforts. I am sure you will get the success soon.

  ReplyDelete
 13. konni nijalu

  http://dedicatedtocpbrown.wordpress.com/2009/12/28/%E0%B0%9A%E0%B1%87%E0%B0%A6%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82-%E0%B0%92%E0%B0%95%E0%B1%8D%E0%B0%95/

  ReplyDelete
 14. నూతన సంవత్సర శుభాకాంక్షలు .

  ReplyDelete