Sunday, August 16, 2009

రెండు రెండ్ళ ఆరంగుళాలు...

ఆదివారం అందరం హాయిగా భోజనాలు చేసి మధ్యాహ్నం టీవీ లో "ఆ ఒక్కటీ అడక్కు" సినిమాని సీరియస్ గా చూస్తుంటే....మా వారికి వాళ్ళ చెల్లికి తనపై మునపటి గౌరవం ఉందో లేదో అన్న అనుమానం మొలకెత్తి మూడున్నర అయినా ఇంకా టీ పెట్టడానికి లేవని మా అందరి మొహాలకేసి చూస్తూ లేదు అని ఫిక్స్ అయిపోయారు....మమ్మల్ని చూసి చెల్లెలికి లేదు అని ఎలా ఫిక్స్ అయ్యారని అడక్కండి విశదీకరిస్తే నాకూ లేదంటారు గౌరవం అందుకే గప్ చుప్....
అయిదు కావస్తుంటే సినిమా అయిపోయాక టీవీని కట్టేసి టీ కప్పుని అందించిన చెల్లికి గౌరవమేకాదు ప్రేమకూడా ఉంది అని నిర్ణయించుకుని దాన్ని నిర్ధారించుకోవడానికి చెల్లీ! రేపు పెళ్ళి వుంది మొన్న నేను కుట్టించుకున్న ప్యాంట్ రెండు అంగుళాలు పొడవు ఎక్కువ అయింది మన టైలర్ దగ్గరకి వెళితే వారం చేస్తాడు కాస్త కత్తిరించి కుట్టి పెట్టవా.... అని అడిగిన దానికి అలాగే అని తలవూపి నాతో వదినా! నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళివస్తాను అన్నయ్య చెప్పిన పని కాస్త నీవే చేయమంది. నాకు రాత్రికి భోజనానికి చుట్టాలు వస్తున్నారు పనివుంది కుదరదని వీలున్నప్పుడు చేద్దాం కాని నీవు వెళ్ళిరమ్మని పనిలో మునిగిన నాకు చెల్లికి అన్నగారిపై గౌరవంతో పాటు అభిమానం కూడా మెండు అని తెలియలేదు. తను అయ్యో అన్నయ్య చెప్పాడు కదా అని ప్యాంటుని రెండు అంగుళాలు కత్తిరించి కుట్టి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టి వెళ్ళింది.
వంట చేస్తున్న నాకు అత్తగారు చుట్టాలు రాత్రి భోజనానికి రావడం లేదు అన్న మాటలతో మొత్తం పని అయిపోయి ఖాళీగా వున్నాన్న ఫీలింగ్ లో ఈయన గారిపై ప్రేమ మరింత ఎక్కువై ఆయనగారి పనిని మక్కువతో చేద్దాం అనుకుని బీరువాలో నుండి ప్యాంటుని తీసి రెండు అంగుళాలు కత్తిరించి కుట్టి బీరువాలో పెట్టాను. ఇది తెలియని మావారు తన చెల్లి ఆ పని చేయలేదని తమ్ముడ్ని పిలిచి వెళ్ళి ఎవరైనా టైలర్ తో దగ్గరుండి కుట్టించుకు రమ్మని బీరువాలో నుండి ఆ ప్యాంటుని తీసి సీరియస్ గా ఇచ్చేసరికి మా మరిదికి మ్యాటర్ ఈస్ మచ్ సీరియస్ అని మరో రెండంగుళాలకి ప్యాంటుని కుదింపచేసి వాళ్ళ అన్నగారిని కూల్ చేసాననుకున్నాడు. పాపం వాడికేం తెలుసు ఆ వెయ్యిరూపాయిల ప్యాంట్ వేసుకోవడానికి వారికి పొట్టిదై నిక్కరుకి కాస్తపొడుగై ఆఖరికి అది ఇంట్లో వేసుకునే బర్ముడా అయిందని......

17 comments:

 1. చిన్నప్పుడు ఇలాంటి కథ ఒకటి విన్నప్పుడు 'నిజంగా ఇలా జరుగుతుందా?' అనిపించింది.. జరిగిందని మీరు ప్రూవ్ చేశారు..

  ReplyDelete
 2. హి హి.. ఇంకొంచెం కత్తిరిస్తే పిల్లాడికి చెడ్డీ గా పనికి వస్తుందండీ ;-)

  ReplyDelete
 3. telugu lo comments raayadam elano naaku teliyatam ledandi srujana gaaru.. mottaniki.. mee blog amogham anipinchindi naaku.. naa lanti modern youth ni kooda mee blog attract chestundi... naa blog lo mee comment choosinappudu chaala anandamesindi.. chaala encouragement ichinattundi.. krutajnatalu..

  ReplyDelete
 4. ఈసారి షర్ట్ ని కత్తిరించి మెగా స్లీవ్స్ వేయించండి మీవారితో!!:)

  ReplyDelete
 5. బాగుందండి! మొత్తానికి అందరి ప్రేమ మీవారికి ఈ పాటికి బాగానే అర్ధమై ఉండాలి

  ReplyDelete
 6. హహ్హ...హహ..
  పాపం మీ శ్రీవారు..

  ReplyDelete
 7. ఇంతకీ ఆ ప్యాంటుని ఎంచేసారండి...??

  ReplyDelete
 8. కత్తి పోయే డాలు వచ్చే ఢాం ఢాం ఢాం పాంటూ పోయి బర్ముడా వచ్చే ఢాం ఢాం ఢాం..
  హె హె హె ఆ ఒక్కటి అడగకు లో రాజేంద్ర ప్రసాద్ దెబ్బ కు మొత్తనికి 100$ వేస్ట్ అయ్యయి అన్నమాట మీ వారికి.

  ReplyDelete
 9. Nice chaala navvu vachhindi papam kada mee husbend

  ReplyDelete
 10. ha ha ha.
  గాఠిగా నవ్వేశ్శాను. అన్నట్టు ఇలాంటిదేదో చిన్న పిల్లల కథొకటి ఉండాలి.
  అన్నట్టు దయచేసి వర్డ్ వెరిఫికేషను సైంధవుణ్ణి తొలగించండి

  ReplyDelete
 11. :) :)
  ...i heard a story like this...

  ReplyDelete
 12. idi already chadivi comment raasaanu but.....chaala baagundi.....excellent

  ReplyDelete