నాకు చిన్నప్పటి నుండి తాతగారిని, నాన్నని మీసాలు లేకుండా చూసి మగవారు మీసాలు లేకపోతేనే మగధీరులు అన్న అభిప్రాయం....దాన్ని ఉత్తరాది హీరోలు అమితాబచ్చన్ గారి అందమైనమోము, రాజేష్ ఖన్నాగారి రొమాంటిక్ అంతా ఆ మీసాలు లేకపోవడంవల్లనే అన్న అభిప్రాయాన్ని అప్పట్లో గట్టిపరిచాయి. ఇది ఇలావుంటే మాపెద్దమ్మ వాళ్ళ మనవళ్ళకి భోజనం తినిపిస్తూ మీరు అన్నం తినకుండా అల్లరిచేస్తే గుబురు మీసాల బూచాడు ఎత్తుకెళ్ళిపోతాడు అని భయపెట్టి తినిపించడంతో నేను నిర్ణయించేసుకున్నాను మీసాలు వున్నవారు బూచాళ్ళని, మీసాలు లేని వారు మంచి మనసున్న మగధీరులని..(మీసమున్న వారంతా నన్ను మన్నించాలండి). తరువాత కాలేజీలో ఫ్రెండ్స్ మధ్య వాదోపవాదాలు జరిగినా మా గ్రూప్ దే(మీసాలు లేని) పై చేయి.....
ఆ అభిప్రాయంతో అల్లుకుపోయిన నా యుక్తవయసుకి పెళ్ళిచూపుల్లో మావారి మీసకట్టుతో కళ్ళెం పడింది.."నా మనసుకి నచ్చిన ఈ మగవానికి మీసమేల!!! అని పరి పరి విధముల మనసు ఘోషించినను.... ఆ ఏమున్నది మెల్లగా బ్రతిమిలాడి, బుజ్జగించుకుని నాదారికి మళ్ళించుకుందునులే అని తలవంచి తాళి కట్టించుకుంటిని"....
అసలు కధ అప్పుడు మొదలైంది...మావారికి మీసాలంటే మహా మోజు, మీసాలులేని వాడు మగాడే కాదంటారు (మీసాలు లేని వారు మావారిని మన్నించాలండి), క్రమంగా మావారి ప్రేమలో నాకు మీసాలపై మక్కువ పెరిగితే, నా ఆలన ఆయనలో మీసాలపై అభిప్రాయాన్ని మార్చింది. ఈ విషయం మా పెళ్ళిరోజున మాకు తెలిసింది.
పెళ్ళిరోజున మావారికి బహుమతిగా ఆయన ఫోటోని పెద్దదిగా లామినేట్ చేయించి, నా వాలు జడలోని కాస్త ముక్కని కత్తిరించి, ఆయన ఫోటోలోని మీసాలకి అందంగా అతికించి, ఫోటోపై
"మీకు మీ మీసాలే అందం...
మీ ప్రేమతో నాకు వాటిపై పెరిగింది అనురాగం...
మీ మోముపై అవి మెరవాలి కలకాలం...
మీ శ్రీమతి ప్రేమతో ఇస్తున్న బహుమానం..."
అని కవిత్వాన్ని(నా దృష్టిలో కవిత్వమనే అనుకుంటూ) రాసి ఫ్రేం కట్టించి ప్యాక్ చేయించి ఆయన కోసం ఎదురుచూస్తుంటే....తెల్లవారింది, ఉదయం నాలుగు గంటలు...ట్రింగ్ !!! ట్రింగ్ మని కాలింగ్ బెల్ మ్రోగింది ఈయనే వచ్చివుంటారు విజయవాడ నుండి ముందుగా నేనే విష్ చేయాలని ఎంతో ఉత్సాహంతో తలుపు తీసిన నాకు గుమ్మానికి ఎదురుగా ఆరడుగుల విగ్రహం....పరిచయమున్న ముఖమే కాని కొత్తదనంతో, కొద్దిక్షణాలు గుర్తుపట్టలేకపోయాను....ఒసేయ్ పిచ్చి మొహమా నేను అంటూ మావారు మీసాలు లేకుండా......
పాపం...:( కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్...
ReplyDeleteఅబ్బో! అదిరిందండి....ఇంతకీ ఇప్పుడు మీవారికి మీసాలు వున్నాయా? లేవా?
ReplyDeletebagundi mi madya pemanuragalu.
ReplyDeletemottaniki mi ayana mi route loki, miru mi ayana route loki vellaru hehehe
కుడి ఎడమైతే అని పాడుకున్నారా ఐతే?
ReplyDeleteబాగుంది మీసాల గొడవ..
హ హ హ్హ హ్హ ...
ReplyDeleteసుజన బాగు౦ది......
వద్దు అని తీరా వదిలేసి వస్తే మీరు గుర్తు పట్టలేదా...
సో బ్యాడ్.....
ఓ.హెన్రీ కథ 'Gift of the Magi' గుర్తొచ్చింది మీ మీసానురాగ గాధలో ట్విస్ట్ చూస్తే :-)
ReplyDeletemeesaala meeda same feelings andi..kaani maavaariki imkaa mIsaalu unnaayi :) :)
ReplyDeleteసృజన గారు... నాకు తెల్సి అమ్మాయిలకు అబ్బాయిల మీసాలు బాగా నచ్చుతాయి..ఈ విష్యం స్వయంగా కొంత మంది అమ్మాయిలే నాకు చెప్పారు...సో మీకు పెళ్లికి ముందు మీసాలు నచ్చలేదు...తర్వాత మీ ఆయన వాళ్ళ నచ్చాయి...ప్రేమలో పడితే మన నచ్చనిది వారిలో కనిపించిన, దాన్ని కూడా ప్రేమిస్తాము...అదే గొప్ప ప్రేమ..
ReplyDeleteసృజన గారు...దయచేసి Word verification తీసేయ్యరూ pleaseeeeeeeeeeeeee....ok na
ReplyDeleteనాకు మగవారికి మీసాలుంటేనే ఇష్టం .. కాని మా ఆయన నేను మా పుట్టింట్లో ఉండగా సడన్ గా మీసాలు లేకుండా వచ్చారు..నేను అయితే అసలు గుర్తు పట్టలేక పోయాను ..రెండు రోజులు పరాయి వాడి ఎదురుగా కూర్చున్నట్లు మహా ఇబ్బంది అయిపోయింది .. కాని ఇప్పటికీ మీసాలు లేకుండా కంటిన్యూ అయిపోయారు ..ఇప్పుడు మీసాలు పెంచితే నచ్చరేమో :)
ReplyDeleteబాగుందండీ మీసాల కథ.. మీ వాలు జడ కత్తిరించి.. ఊహించుకుంటే భలే ముచ్చటగా అనిపించింది.. ముగింపు భలే.. ఊహించని ట్విస్ట్...
ReplyDeleteNice one... august 15th sandharbham gaa chinna post raasa... ela undho cheppandi...
ReplyDeleteహ హ హా... :)
ReplyDeleteమీ బ్లాగ్ బాగుంది.
మీ ఫోటో ఇంకా బాగుంది :)
నాకు మీసాలు పెంచడం అంటే ఇష్టమే కాని వాటిని రెగ్యులర్ గా కట్ చేయడం, ట్రిం చేయడం గొడవంతా ఎందుకని మొదటి నుంచి మీసాలు పెంచలేదు, అలాగే మా ఆవిడకి కూడా మీసాలు ఉంటే నచ్చదు, సో ఇద్దరం హాప్పీస్.
ReplyDeletethat is called love.frequency matched annamata
ReplyDelete