మురళీగారి "ఆషాడమాసాన" టపా చదువుతున్నాను, పూర్తి అయ్యేసరికి నా కంటి ముందు నలుపురంగుపై తెల్లని చక్రాలు గిర్రు గిర్రున తిరుగుతుంటే వాటికి అంతరాయం కలిగిస్తూ మావారి గుర్రు....గుర్రు!! అయినా! చక్రాలకి కొత్తకాని నాకిది అలవాటే....అమ్మో ఏంటి ఇలా అన్నీ ఏకరువు పెట్టేస్తున్నాను....మావారికి దిష్టి తగులకుండుగాక!!!
మమ్మల్ని కూడా ఆషాడ విరహం అనుభవించమని గవర్నమెంటువారు శని ఆదివారాలతో ఒకరోజు సెలవు ఇస్తే నేను రెండువేసి మొత్తం ఐదు రోజులు మా పుట్టింటికి చెక్కేసాను... ఈ అవకాశం మరల మరల రాదు అనుకున్న (అదికాదులెండి మిమ్మల్ని చూడకుండా వుండలేక అంటారా!....ఏవండీ అలా నిజాలని మరీ బయటపెట్టేయకండి!!!) మావారు రెండవ రోజే అత్తగారింటికి అర్థరాత్రికి అరగంట ముందుగా అడుగుపెట్టబోయారు........అమ్మాయ్! అబ్బాయిని అడుగు ముందుకు వేయకుండా ఆపు అని లోపలినుండి అమ్మ అరుపు, అది విని మావారు ఆగిపోయారు కాని నేను ఆగలేక అడుగు బయటికి వేసి అరుగుపై కూర్చుని కాదు కూర్చోమని అడిగాను....ఏవిటండి మాటైనా చెప్పకుండా వచ్చేసారని.....
పిచ్చిదానా! మనం కూడా ఆషాడంలోని అవస్తల్ని అనుభవిద్దాం అన్నారు..... దానికి అర్థం నాకు గంట తరువాత ఆయన నడుముకి జండూబాం రాస్తున్నప్పుడు అర్థమైంది.
మీకు అర్థం కాలేదా?
కావాలంటే చదవండి.....
ఆషాడంలో అత్తగారింటి గడప దాట కూడదు కాని గోడ దూకవచ్చునంట! అని అమెరికాని కనుక్కున్న వాస్కోడిగామా లెవల్ లో చెప్పారు. ఏదైతేనేమిలెండి! వచ్చారుగా విచ్చేయండి అన్నాను అర్థరాత్రి ఎక్కడికి వెళతారులే అని. అప్పుడు నాకు తెలియలేదు ఆయనకి అమ్మాయిల ఇంటి గోడదూకి సైటు కొట్టి నడ్డి విర్గొట్టించు కోవాలనే కోరిక చాలా కాలంగా వుందని దాన్ని ఇలా తీర్చుకున్నారని....కాంపౌండ్ గోడని ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన ఫీలింగ్ లో ఎక్కారు, ఎక్కితే పర్వాలేదు దిగడం మాటో! దిగలేదు దూకారు.........
పర్యవసానం నడుము దగ్గర బెణుకుడు.
అదృష్టం బాగుండి ఏకాలోచెయ్యో విరగలేదు, అయినా అబ్బాయికి ఇలాంటి విచిత్రమైన కోరికలేవిటే అంటూ అమ్మ వేడినీళ్ళు పెడుతూ వంటింట్లో గొనుగుడు. మీకెందుకొచ్చిన అవస్త చెప్పండి అంటూ నేను ఆయన నడుముకి మందు రాసి కాపడం పెడుతూ..నసుగుడు.
మనం సొంత ఇల్లు కట్టించుకున్నప్పుడు గడపలే పెట్టించు కోవద్దంటూ మావారు నా చెవిలో కొరుకుడు.
అదండీ అలనాటి ఆషాడం అవస్తలు.....
mmmmhahahahaa bagundi..........
ReplyDeleteప్రేమ కోసమై గోడను దూకెన పాపం మీవారు....అయ్యో పాపం మీ అమాయక శ్రీవారు....
ReplyDeleteమీ పోస్టుల్లో ‘ఆశా’డం సవ్వడులు అదిరిపోతున్నాయి...
బాగుందండీ మి ఆషాడం అవస్త!!నాకూ అలాటి స్మృతులు ఉన్నాయి కానీ ...అవి చెప్పలెనివి:) :)
ReplyDeleteపర్లేదు..నా టపా చాలా విషయాలే గుర్తు చేసిందన్న మాట.. బాగున్నాయండి కబుర్లు..
ReplyDeleteఅయితే నేను ఆషాడానికి ముందు నెలలోనే పెళ్ళిచేసుకుంటాను లెండి...లేకపొతే ఇవ్వన్నీ మిస్ అయిపోతానుకదా!
ReplyDeleteఆ సమయంలో అలా వుంటుంది మరి.. తప్పవు జండూబాం కష్టాలు..
ReplyDeleteఅయితే మీవారు అప్పట్లో హీరో అన్నమాట!
ReplyDeleteబాగున్నాయి మీ ఆషాడం అవస్థలు...పాపం మీ అయిన :(...అయినా ఆడవాళ్ళ కోసం మా మగవాళ్ళ కష్టాలు ఎపుడూ ఉండేవే లెండి...
ReplyDeletenice.. had a good read... thanks...
ReplyDelete