పద్దెనిమిదేళ్ళ క్రిందటి మాట......ఆ సంవత్సరం వినాయక చవితి విజయవాడలో చేసుకుని సాయంత్రం విహారానికి కృష్ణ బ్యారేజ్ మీదకి వెళ్ళి అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకుందామని వెళ్ళిన మాకు ఎదురైన చేదు అనుభవం! అందరూ ఇలా ఉంటారని కాదు కాని చాలా భాధని కలిగించిన విషయం.....
ఇంద్రకీలాద్రి పైవున్న అమ్మవారిని దర్శించుకోడానికి రహదారిన, వాహనంలో కాకుండా మేము వెనుక వైపున వున్న మెట్లపై నుండి మెల్లగా నడచుకుంటూ వెళుతున్న మాకు రోడ్డుకి ఇరుప్రక్కల నుండి కొబ్బరికాయలు, పూలు, కుంకుమ కొనుక్కోండి...రండమ్మా! అన్న పిలుపులతో మాకు మాతా( అమ్మవారి) దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కుంకుమార్చనయే మార్గమని తలచి వందగ్రాముల కుంకమ ఇవ్వమన్నాం.....కుంకుమతో పాటు చీరకట్టించండి అమ్మవారి కరుణాకటాక్షాలు మీ సొంతమంటూ ఒక బుట్టలో పూలు, కొబ్బరికాయ, చీర, ఒక కాగితపు పొట్లం, అగరొత్తులు, హారతి కర్పూరంతో పాటు అరడజను ఎర్రగాజులు ఇచ్చి రెండువందలయాభై తీసుకుంది. వాటిని తీసుకుని నేను మావారితో పైకి మెట్లెక్కుతూ......మెట్లకి పసుపు రాస్తూ కుంకుమ బొట్లు పెడుతున్న భక్తులని చూస్తూ వీళ్ళంత పుణ్యం కాకపోయినా కుంకుమార్చనతో కాసింతైనా రాకపోతుందాని ఆలోచిస్తూ ఆనందంగా పైకెక్కి అర్చనతో పాటు స్పెషల్ దర్శనానికి టిక్కెట్ తీసుకుని గుడిలో పూజారికి కుంకుమార్చన చేయమని చెప్పి పళ్ళెంలో పదిరూపాయిలు వేస్తే మమ్మల్ని లోపల ప్రక్కకి నిలబెట్టి పదినిమిషాల తరువాత ప్రత్యేకమైన శ్రధ్ధతో అర్చన చేయిస్తూ కుంకుమ పొట్లం విప్పి పళ్ళెంలో పోస్తూ పూజా సామాగ్రిని మీరు దేవస్థానం వారి దుకాణంలో కొనలేదా! అని మావైపు జాలిగా చూసి కాగితం పొట్లాన్ని పూజారి మాకు చూపిస్తూ ఎప్పుడూ బయట కొనకండి ఇలాగే మోసం చేస్తారు అని చెప్పారు....అందులో మెత్తని ఇటుక పొడిని అదిచూసి నా మనసు ఎంత భాధ పడిందంటే నేను ఇప్పటికీ దుర్గగుడికి వెళితే అర్చన చేయించడం కాని కొబ్బరికాయ కొట్టడం కాని చేయను, హుండీలో వాటి తాలూకు డబ్బులు వేసి దణ్ణం పెట్టుకుంటాను. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం కుంకుమ విషయంలో ఎందుకు ఆవిడ అంత మోసం చేసింది అని!!! మావాళ్ళంతా మాత్రం మీ ముఖాలని చుస్తేనే వాళ్ళకి మోసం చేయ్యాలనిపిస్తుంది అంటారు.
కు౦కు౦ ఏ కాదు,పాలు,నీళ్ళు,ఆఖరుకి కురగాయలు కుడా కల్తినే!
ReplyDeleteఏ౦ బావుకు౦దామని కనీస ఇ౦గిత౦ లేకు౦డా చెస్తారో తెలియదు.
పొట్ట కోస౦ అయితే కాదు...మార్పూ ఆచి౦చడ౦ అవివేక౦ అన్పిస్తు౦ది..
ఇ౦క ఇ౦క దిగజారిపోతున్న పరిస్ధితి చుస్తే నాకు భయ౦ వేస్తు౦ది.
నమ్మక౦ అనే మాట అటు ఇటు అర్దలు వచ్చె పదాలు కుడా మర్చిపొవాలేంమొ..
ఇంత మరీ మోసమా? నమ్మబుద్దికావడం లేదండీ...
ReplyDeleteపుణ్యక్షేత్రాలలో 'అవినీతి' కి బాదితులవ్వని వాళ్ళెవరూ ఉండరేమో.. ఏదో ఒకరూపంలో మనల్ని పలకరిస్తుంది.. మీరెంత సెంటిమెంట్ ఫీలై ఉంటారో అర్ధం చేసుకోగలను.. మా ఇంట్లో గుడికి వెళ్ళేటప్పుడు పసుపు, కుంకుమ ఇంట్లోనుంచే తీసుకెళతారు..
ReplyDeleteపుణ్యక్షేత్రాలలో ఇలాంటివన్నీ జరుగుతూనే వుంటాయండి. ఆ రద్దీలో, హడావిడిలో మనం గమనించే స్థితిలో వుండము కదా..అదే వారికి అవకాశం.
ReplyDeleteసృజన, పుణ్యక్షేత్రమే కాదు, విహారయాత్రల్లో, సాధారణా ప్రయాణాల్లో, బంధువర్గాలు, స్నేహితులు, నిరక్ష్యరాస్యుల వలన, విధ్యాధికుల చేతిలోను, వయోబేధం లేకుండా [10 ఏళ్ళ యాచకులు, 70 ఏళ్ళ పూజారులు] ఇలా అన్ని విధాలా "అవినీతి" తాలూకు చేదు అనుభవాలు చవిచూసాను. అది అవసరం చేయిస్తున్న పనా, స్వార్థం సాగిస్తున్న వికృత క్రీడో నాకు తెలియదు. కానీ మనసులో "నమ్మకం" స్థానే "అనుమానం" తావుచేసుకోవటం మాత్రం మొదలై ఎన్నో ఏళ్ళైపోయింది. అయిన "మానవత్వం" ముసిరేవుంది, తన పని తాను చేస్తుంది. అనుభవాలున్నదే జీవితం నేర్పే పాఠాలుగా అధ్యయనం చేయమని కాదా?
ReplyDelete"ఉదర నిమిత్తం
ReplyDeleteబహు కృత వేషం ."
దేవళముల వద్ద మాత్రమేనా?
షాపులలో - వ్యాపారాలలో - వస్తువుల క్రయ విక్రయాలూ , బేర సారాలూ వగైరా
ఇంకా ........ వృత్తులు , ఉద్యోగాలూ అన్ని చోట్ల ప్రజలు మోస పోతూనే ఉన్నారు -వాటిలో గుర్తు పట్ట లేనివి కూడా అనేకం ఉంటూనే ఉంటాయి..
కొన్నాళ్ళు మననం చేసుకోవడానికి ఇలాటి అనుభవాలు పనికి వస్తాయి.
అలాగే ,యాత్రా అనుభవాల డైరీలో - ,అలాగే జ్ఞాపకాల పుస్తకంలో
ఇలాటి పుటలు రీడబుల్ గా ఉంటాయి.
" సరస్వతీ దేవి కోవెల ఉన్న్ - వర్గిల్ "లో మాకు ఒక వింత అనుభవం ఎదురైనది. కొంచెం ఓపిక చేసుకుని రాస్తాను.
మీ రచనయే స్ఫూర్తి, సృజనా!
(కోణ మానిని బ్లాగు /కాదంబరి )
ఇలాంటి మోసాలు గుడికి వెళ్ళాలనే కోరికనే తగ్గించివేస్తాయండి..
ReplyDeleteకొన్ని దేవాలయాల దగ్గర దారి పొడుగునా చిన్న చిన్న విగ్రహాలు పెట్టేసి, రసీదులూ అవీ ఇచ్చి డబ్బులడిగేవాళ్ళు కొందరున్నారు...చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవటం అంటే ఇదేనేమో...!
kada.......nenu max adiginanta ichhi kontaanu evaridaggaraina .....nannu baaga mosam chestaaru...beram aadananduku vaallu ichhe kosaru emo idi(mosam)
ReplyDelete