అవి నేను ఉద్యోగంలో కొత్తగా చేరిన రోజులు, వరంగల్ లో ఒక పోర్షన్ అద్దెకు తీసుకుని ముగ్గురు స్నేహితులము కలసి ఉండేవాళ్ళము.
నా స్నేహితులిద్దరూ వాళ్ళ ఇళ్ళకు వెళితే నేను ఒక్కదాన్ని బోర్ కొడుతుందని తలుపు తాళం వేసి గొళ్ళెం మరచి పక్కింట్లో టి.వి చూస్తూ కూర్చున్నాను. 'స్వర్ణకమలం' విశ్వనాధ్ గారి సినిమా నేను ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అర్థం చేసుకోరూ!!!!
మీరు అర్థం చేసుకున్నరో లేదో కాని నాకు వంటచేసి పెట్టినవాడు మాత్రం బాగా అర్థం చేసుకున్నాడేమో.......
మా పోర్షన్ గొళ్ళెం తీసి వంట చేసుకుని వాడు చక్కగా కొత్త ఆవకాయతో అన్నం ఆరగించి నాకు కూడా కాస్త ఉంచిచాడనుకోండి!!! నా హ్యాండ్ బ్యాగ్ లోని డబ్బులు జీతం మొత్తం తీసుకుని, 3 రూపాయిలు నాకు మరునాడు బస్సు కోసం అని చిల్లర ఉంచి...అక్కడ టేబుల్ పైన ఉన్న పుస్తకాల్లో నుండి యండమూరిగారి అభిమాని అనుకుంటాను పాపం.......'ప్రార్ధనా, 'డైరీ ఆఫ్ మిస్సెస్స్ శారద ' అనే రెండు నవల్లను తీసుకుని మిగిలిన పుస్తకాలు చక్కగా సర్దిపెట్టాడు. వెళుతూ వెళుతూ ఏమనుకున్నాడో గిన్నెలు కడిగి బోర్లించిన గిన్నె క్రింద చిన్ని కాగితంపైన, సమయ భారం వలన కూర చేయలేదు పచ్చడితో సరిపెట్టుకోండి అని వ్రాసి మరీ వెళ్ళాడు. ఎంతైనా మంచిదొంగ కదండీ!!!
ఈవిడ ఏంటి వాడు అంటుంది, అది అయ్యివుండవచ్చు కదా అనుకుంటున్నారా? మంచి దొంగ సిగరెట్ ప్యాకెట్ వంట గదిలో మరచి పోయి వెళ్ళాడు. అది అయ్యివుంటే మా ముగ్గురి చీరలకి రెక్కలు వచ్చి వుండేవి......ఏవంటారు!!!
ఏమైతేనేమీ మంచి దొంగే అంటారు!!!
>> "ఈవిడ ఏంటి వాడు అంటుంది, అది అయ్యివుండవచ్చు కదా అనుకుంటున్నారా? మంచి దొంగ సిగరెట్ ప్యాకెట్ వంట గదిలో మరచి పోయి వెళ్ళాడు. అది అయ్యివుంటే మా ముగ్గురి చీరలకి రెక్కలు వచ్చి వుండేవి......ఏవంటారు"
ReplyDeleteజీన్స్ వేసుకుని సిగరెట్లూదేసే అల్ట్రా మోడర్న్ మహిళా దొంగయ్యుండొచ్చుగా?
చాలా బాగా రాస్తున్నారు.. ఇంకా మంచి మంచి విషయాలను గుర్తు చేసుకుని మమ్మల్ని నవ్వించండి మరి :)
ReplyDelete:)
ReplyDeleteబాగుంది మీ స్మృతుల సవ్వడి...
ReplyDeleteమరిన్ని సవ్వడులతో మారుమ్రోగాలని ఆశిస్తున్నాను....
చాలా బాగున్నాయి మీ అనుభవాలు.
ReplyDeleteజీన్స్ వేసుకుని సిగరెట్లూదేసే అల్ట్రా మోడర్న్ మహిళా దొంగయ్యుండొచ్చుగా?
ReplyDeleteఅబ్రకదబ్ర గారు బాగా చెప్పారు
@ భవాని, నేస్తం, శివ బండారు, మాలాకుమార్ గార్లకి ధన్యవాదాలండి.
ReplyDelete@ పద్మార్పితగారు! మీరు నా మొదటి బ్లాగ్ మిత్రురాలు.....
నాలో ఈ ఉత్తేజానికి కారణం మీ కవితలు. రోజు మీ కవిత ఒకటైన చదవకుండా నిదురపోనంటే నమ్ముతార!
నేను చదవడమే కాదు మా శ్రీవారికి కూడా వినిపిస్తాను, రెండు రోజులు ఏవి చదవకపోతే ఏంటీ మీ పద్మ కొత్త కవిత రాయలేదా అని అడుగుతారంటే నమ్మాలి......మీరు మాలో అంతగా కలసి పోయారన్నమాట.
@ అబ్రకదబ్ర గారు, కధాసాగర్ గారు.....ఒకవేళ అల్ట్రా మోడ్రన్ ఆడదొంగ అయివుంటే మాత్రం శ్రమ అనుకోకుండా కూర కూడా చేసి వుండేదేమో!
అయినా కొన్ని క్రెడిట్స్(smoking) మగవాళ్ళకిస్తేనే బాగుంటాయేమో ఆలోచించండి!
srujana గారు
ReplyDeleteముమ్మాటికీ మంచి దొంగ అయ్యి వుంటాడు..ఇంత మంచి పోస్ట్ రాదు కదా ఎగిరివుంటే
వరంగల్ దొంగలు మంచి దొంగలన్నమాట...
ReplyDeletesRjana gaaru mii Saili caalaa baagundi. manci camatkaaramgaa raastunnaaru. idE nEnu iTugaa raavaDam... caalaa cadavaali. abhinandanalu.
ReplyDeleteఆకలి దొంగను బాగా అవిష్కరించారు. మీ సృజన బాగుంది.
ReplyDelete'ప్రార్ధన' 'డైరీ ఆఫ్ మిసెస్ శారద' ...కచ్చితంగా మగ దొంగేనండి !!
ReplyDeleteనా బ్లాగ్ కి విచ్చేసి నన్ను మీలో ఒకరిగా చేర్చుకున్న బ్లాగ్ మిత్రులందరికీ కృతజ్ఞతలు.....
ReplyDeleteచాలా బాగుందండి టపా.....
ReplyDelete@భావన
ఆ మరేనండి, ఒకసారి వరంగల్ వెళ్ళి చూడండి. మనలో మన మాట వెళ్ళేటప్పుడు నాకు చెప్పి, చెతి సంచి(అదే హ్యాండ్ బ్యాగు) లో కాస్త దిట్టం గా నగదు పెట్టుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు నాకు చెప్పమని మరొక్కసారి మనవి.
:)భలే ఉంది దొంగ ప్రహసనం. అబ్రకదబ్ర గారు, ఆడ దొంగ జీన్స్ వేసుకుని సిగరెట్టు ఊదనవసరం లేదు. చీర కట్టుకుని, చేతి నిండా గాజులు, తలలో మూడు మూరల మల్లెలు పెట్టుకుని మరీ ఊదచ్చు. కావాలంటే సైబర్ టవర్స్ దగ్గరకి వచ్చి చూడండి. అంటే వాళ్ళందరూ దొంగలు అని కాదు కానీ
ReplyDelete"New wine in old bottle"