ఆషాడమాసం వచ్చిందంటే నేను పైన సూట్ కేసులో నుండి నాకు మాశ్రీవారు కొనిచ్చిన చిలకాకుపచ్చరంగు పట్టుచీరని తీసి చూసుకోకుండా, శ్రావణమాసానికి చీరకొనుక్కోనండీ!! అని చెబితే మీరు నమ్మాలండీ.....ఎందుకంటారా?
సరే మరైతే ఇంకెందుకు ఆలశ్యం ఒక్కసారి నా సృతుల సవ్వడి వినండి మరి!!!
శనివారం విజయవాడలో బస్సెక్కి వరంగల్ వద్దామని బయలుదేరిన మావారు బస్సు ఇంకా బయలుదేరడానికి అరగంట పడుతుంది అని తెలిసి టీ తాగి ఒక దమ్ము కొడదామనుకుని బస్టాండ్ నుండి బయటికి వస్తుంటే "అయ్యగారండీ.....ఒక్కనిముషం" అన్న మాటతో వెనుదిరిగి చూసారు. ఒక ముప్పైఏళ్ళ వయస్సున్న యువతి నా దగ్గర రెండు కొత్త కంచి పట్టుచీరలు వున్నాయండి మీకు కావాలాండి అని అడిగిందట. నన్నే ఈవిడ ఎందుకు అడిగిందా అని ఆశ్చర్యపోతున్న (బహుశా మనసులో మురిసిపోతు) మావారి మనసునెరిగి ఆవిడ నా పర్సుని ఎవరో కొట్టేసారండి ఇప్పుడు నేను బస్సు ఎక్కి వెళ్ళకపోతే మళ్ళీ రాత్రి పొద్దుపోతుంది ఇంట్లో కంగారు పడతారు, షాపుకి వెళ్ళి తిరిగి ఇచ్చే టైము లేదు అందుకని మీకు నచ్చితే తీసుకోండి అంటూ రెండు అందమైన అమ్మాయిల బొమ్మలున్న అట్టపెట్టెలని చేతిలో పెట్టింది. అట్టపెట్టె మీది అమ్మాయిలే నచ్చారో లేక అందులోని చిలకాకు రంగు చీరే నచ్చిందో కాని ఆమె పదిహేను వందలు అనగానే ఇంకో మాట అనకుండా టక్కున డబ్బులు ఇచ్చేసి పట్టుచీరను చట్టుక్కున లాక్కొని చిటుక్కున బస్సెక్కేసారు......
ఇంటికి రాగానే ఏమోయ్! నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ నాకు అందించిన అట్టపెట్టెని చీర అని అంచనా వేసి...... భోంచేసాక చూస్తానులెండి మీరు అలసి పోయారు స్నానం చేసిరండి అంటూ వంటింట్లోకి వెళ్ళి హడావిడిగా హల్వా తయారు చేసాను.....ఎందుకనో మీకు వేరే చెప్పాలటండీ?(పట్టుచీర తెచ్చి నందుకు పాలిష్)....ష్ ష్... ఇలా నిజాలని బయట పెట్టకండీ!
భోజనాలు అయ్యాక పదిరోజుల్లో శ్రావణమాసం వస్తుంది కదా! అప్పుడు కట్టుకుంటానండి అంటూ చిలకాకుపచ్చకి ఎర్రని అంచున్న కంచిపట్టు కోకకి కొంగు ఎలావున్నదో కదా అని కోరికతో మడత విప్పిన నేను...చూస్తున్న మావారి నోటి నుండి ఒకేసారి ఆ!! అనే శబ్ధం చుట్టూ నిశ్శబ్ధం....
ఇదీసంగతి!....చిలకాకు పచ్చ రంగున్న పట్టుచీర కాదు పట్టు పరకిణీ అయినా బాగుండేది అదీ కాదు పట్టు బ్లౌస్ కి కాస్త ఎక్కువ టవల్ కి కాస్త తక్కువ అయిన ఎర్రంచు పట్టు పీలికని పేపర్ల పైన మడతపెట్టి పెట్టెలో పెట్టి....... ఇంక ఎందుకులెండి అసలు విషయం తెలిసింది కదా!!!!
హమ్మయ్య.... భోంచేసిన తరువాత చూసారు లేకపోతే ఆరోజు పస్తుండేవారేమో!!
ReplyDeleteఅయ్యో, మీకు ఆ ఆషాడంలో చీర మిస్ అయిందా?
ReplyDeleteనేను నా బ్లాగ్గులో 1975 లో మా ఫ్రెండ్ ఇంట్లో జరిగిన " బియ్యం " మోసం గురించి వ్రాసినది గుర్తుకొచ్చింది.అంటే మోసపోయేవాళ్ళు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉన్నారు.
ReplyDeleteపోనీ బ్లౌజ్ అయినా కుట్టించుకుని దాని మాచింగ్ సారీ కొనుక్కుని ఉండాల్సింది.గుర్తుగా ఉండేది.
ReplyDeleteఇలాంటి మోసాలకి మగవాళ్ళే టార్గెట్ అవుతూ ఉంటారెందుకనో.. మీరు రాసిన విధానం బాగుంది..
ReplyDelete@ పద్మార్పిత గారు అలాంటిదేమీ లేదు, దేని దారి దానిదే...
ReplyDeleteఏవిటండి మీ కవితలు లేక బ్లాగ్ చిన్నబోయింది....
@ పానీపూరీ లో నీళ్ళు లేవంటే నమ్ముతారటండీ!
అలాగే ఆ ఆషాడంలో మిస్ అయిన చీర ఆ శ్రావణంలో కొట్టేసా!
@ హరెఫలగారికి నా బ్లాగ్ కి విచ్చేసినందుకు కృతజ్ఞతలు.
@ తృష్ణ గారు..బ్లౌస్ కుట్టుకుని వాడితే ఇప్పటికి నామరూపాలు ఉండేవికాదేమోనండి!
@ మురళీగారు ధన్యవాదాలు...మోసాలకి మగవారంటే మోజేమోనండి!
>ఇలాంటి మోసాలకి మగవాళ్ళే టార్గెట్ అవుతూ ఉంటారెందుకనో
ReplyDeleteఅవునండి, మగవాళ్ళు ఉట్టి అమాయకులు
> నేను పైన సూట్ కేసులో నుండి నాకు మాశ్రీవారు కొనిచ్చిన
ReplyDeleteఅయ్యో మీరు చీరలు బీరువాలో పెట్టుకోరా?
తక్కువ ధరకే ఏవేవో కొన్నామనే " ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ " లో పాపం మొగవాళ్ళే పావులౌతారు!! అందుకనే చూడండి.. ఆడవారు చేసినట్లుగా బేరం మొగవారు చేయలేరు.
ReplyDeleteపానీపూరిగారు....వాడనివి కంటికెదురుగా ఎందుకని, తీపి గుర్తుగా పైన సూట్ కేసులో పెట్టాను....మరీ ఇంత అమాయకులైతే ఎలా చెప్పండి? అర్థం చేసుకోరూ!!!
ReplyDelete> ....మరీ ఇంత అమాయకులైతే ఎలా చెప్పండి? అర్థం చేసుకోరూ!!!
ReplyDeleteమీరే ఒప్పుకున్నారు మగవాళ్ళు అమాయకులని
భలేగా రాశారు, ఆషాఢంలో శ్రావణమా అని పాడుకోవచ్చు. :)
ReplyDeleteఅవునూ, విజయవాణ్ణించి వరంగల్లుకి బస్సుందా?
భలే! చిన్నప్పుడెప్పుడో గళ్ళ కూడిక కరక్ట్ గా చేసి పంపిస్తే, నాకేదో పోస్టులో వచ్చిన అనుభవం గుర్తొచ్చింది. ఆ కూడిక అప్పుడే పుట్టిన వాళ్ళు కూడా చేయగలిగేలా ఉండేది.
ReplyDeleteఅవునూ నిజంగానే, విజయవాడ నుంచి వరంగల్ కి డైరక్ట్ బస్సుందా!! ఒకవేళ ఉన్నా కూడా ట్రైన్ సుఖం కాదూ. నేను నాలుగు సంవత్సరాలు తిరిగా విజయవాడకి, వరంగల్ కి మధ్య. అప్పట్లో అయితే ట్రైన్ మాత్రమే ఉండేది.
కధకి అనుకూలంగా అలా రాయాలసివచ్చింది కాని విజయవాడ దగ్గిర ఉన్న ఊరు నుండి ఖమ్మం వరకు బస్సు అక్కడి నుండి ట్రైన్ ఇలా ఏవో తిప్పలు పడేవాళ్ళమండి, నాకన్నా ఆయనే ఎక్కువ తిరిగేవారు...ఇలా తిరిగినప్పటి వింతలు, సృతులతో మిమ్మల్ని వేధిస్తానుగా వేచి ఉండండి....Thanks for visiting my blog.
ReplyDeleteNamaskaramu andi,
ReplyDeletechala baga rasaranadi nenu kuda mee andari spurthi to rasthunnau konchem okasari veelu chusukoni na blog ki vachhi mee amulyamina salahalanu e mirchyvarma ane pillodiki ivvagalarani asishthunnau andi
http://mirchyvarma.blogspot.com
మరి కట్టుకున్నారా? :)
ReplyDeleteany how ....edina gaani premato techharu gada....
ReplyDelete