"టీ" త్రాగుతున్న శ్రీవారు కబుర్ల మధ్యలో నా బ్లాగ్ పై అభిమానం పెల్లుబికి ఏంటి ఈ మధ్య ఏమీ రాయడంలేదు అన్నదానికి సమాధానంగా.... ఏమీలేదు ఏదో బ్రహ్మచారులు భార్యభాధితులు అవుతున్న తరుణంలో మన స్మృతులతో వాళ్ళని ఇంకొంచెం కంగారు పెట్టడం ఎందుకని చెప్పేలోపే.... తమరి ఆలోచనలు ఆవకాయతో అటకెక్కాయా అన్నారు....ఇంక నేను ఊరకుంటానా చెప్పండి?? ఆయనగారు తనంతట తనే వారి ప్రతాపాల గురించి చెప్పమన్నాక, అదేలెండి వ్రాయమన్నాక)చదివేసుకోండి:):):)
వరంగల్ లో కలసి పనిచేసిన అభిమానమో లేక హైదరాబాదులో వాళ్ళకి ఉన్న పనుల ప్రభావమో ఒక ఆదివారము నా ఐదుగురి కొలీగ్స్ ని మాఇంటికి వచ్చేలా చేసింది.వాళ్ళతో మాట్లాడుతున్న నాపై మావారికి ప్రేమ పొంగిందో లేక వచ్చివారి దగ్గర మాంచి పేరు కొట్టేయాలి అన్న ఆలోచనే వచ్చిందో.....పాలు వేడిచేయమంటే పెరుగు పొయ్యిమీదపెట్టే ప్రబుద్దులు "మసాలా టీ" చేసి వాటితో పాటు బిస్కెట్స్ ని కూడా సర్వ్ చేసారు.ఆయన ట్రే తీసుకుని హాల్లోకి వస్తుంటే ప్రెజంటేషన్ ఈస్ మోర్ ఇంపోర్టెంట్ దాన్ ప్రిపరేషన్ (presentation is more important than preparation) అని అప్పుడెప్పుడో సంజీవ్ కపూర్ ప్రఖ్యాత చెఫ్ చెప్పిన మాటలు నా మెదడులో, ఆయనగారి పాకశాస్త్ర ప్రావీణ్యము తెలిసిన నా ప్రేగులు కడుపులో సుడులు తిరిగాయి. నేను సరిపెట్టుకుని వాళ్ళకి సర్దిచెప్పేలోపే ఈయనగారు వాళ్ళతో మాట్లాడడం అందరికి ఒక్కోప్లేటు అందించడం జరిగిపోయింది. బిస్కెట్స్ తింటూ మావారితో మాట్లాడుతూ నా అదృష్టానికి మనసులో కుళ్ళుకుంటూ ఒకరు, ఇంటికి వెళ్ళి ఇది చెప్పి వాళ్ళాయనకి ఇంకా మంచిపేరు ఎలా తెప్పించాలో అని ఇంకొకరు, నా అదృష్టాన్ని పొగుడుతూ మరొకరు, టీ వైపు చూస్తూ మరో ఇద్దరు తినడం కానిచ్చారు.
బిస్కెట్స్ తిన్నాక టీ అలవాటులేదని ఒకరు వద్దంటే, టీ వాసనతో దాని రుచిని పసికట్టిన ఆవిడ సుతారంగా కాదంది. మరొకావిడ మాటల్లో పడి టీ మాటే మరచింది. వీరి ముగ్గురి అదృష్టానికి కుళ్ళుకోవడం నావంతైతే మావారి "మసాలా టీ" ని నషాలానికి ఎక్కించుకున్నవారు ఇరువురు. దాని ప్రభావంతో ఒకరు ఇప్పటికీ టీ ని ముట్టరు. మరొకరు మావారిని తలచుకున్నప్పుడు మసాలాని మరువరు.
హైదరాబాద్ ఇరానీ టీ ఎలా చేయాలో తెలియదు, మసాల టీ తెలుసుకుని చేయవలసినంత గొప్పదేం కాదు అనుకున్న మావారు టీ పొడిని, పాలని, పంచదారని కలిపి మరిగించి అందులో మసాలాపొడిని స్పెషల్ టేస్ట్ కోసం అల్లంవెల్లుల్లి పేస్ట్ ని కొంచెం వేసారండి అది విషయం........
super recipe andi..
ReplyDelete:D LOL!
ReplyDelete:D :D
ReplyDeleteఅమ్మో మీ ఇంటికి ఎప్పుడైనా వస్తే మీ వారి తో టీ మాత్రం పెట్టించకూడదన్నమాట ఇదేనా ఇంకా ఏమైనా స్పెషల్ రెసిపీ లు వున్నాయా తల్లి మీ వారికి. ;-)
ReplyDeleteSuper recipe. Sanjay Kapoor would be envious!!
ReplyDelete:) :)
ReplyDeleteఇంట్లోకి ఇలా భార్య గారి స్నేహితురాళ్లో...అనుకోని అతిథులో..రాకుండా ఉండాలంటే మీ వారు పెట్టిన మసాలా టీ బాగా పనికి వచ్చేలా ఉందే...నేను పెళ్లయాకా తప్పక ఇది ట్రై చెయ్యాలి ఆవిడ గారి స్నేహితులు ఎప్పుడైనా వస్తే ;-)
ReplyDeleteI strongly object it .. It was a ginger tea and good for your friends health.
ReplyDeleteAyinaa mee ladies ki maa vantalu chuste kullu anduke ilaa unpopular chestaaru :)
మా ఆయన బ్లాగులు చదవరు . బతికి పోయాను .
ReplyDeleteనాకైతే భలేగా నచ్చేసిందిగా మసాలా టీ:)
ReplyDeleteలాభంలేదు...భారారా గారితో కోచింగ్ ఇప్పించుకోవాల్సిందే. ఐనా ఇందులో ఏదో హిడెన్ ఎజెండా ఉన్నట్టు కనిపిస్తుంది....; ) కుటుంబరావులూ ఇది మీకే అంకితం హ హ్హహ్హహ :)
ReplyDeleteJaabili:-thats my hubby:)
ReplyDeleteRaghu:-Thank qqq:D:D
భావనగారు గట్టిగా అనకండి మీరు వస్తే కొబ్బరి పచ్చిమసాలా కాఫీ పెట్టిస్తారేమో:)
harephala ji:-Thank you.
తృష్ణగారు:-:):)
Ramakrishna Reddy:-In front crocodile festival is there, don't worry:):)
ReplyDeleteభాస్కర రామి రెడ్డిగారు:- I strongly believe that ginger tea is good for my friends health but ginger along with garlic causes stomach obstruction and loose motions too:):)
Ayinaa mee gents ni memu enta popular chesina mammalni aadi posukovadam maanaru:):)
మాలాకుమార్ గారు:- చదవకపోతే మీరు ఊరుకుంటారా! చదివి వినిపించరా?:):)
పద్మార్పితా:- అయితే మీకో కప్పు మసాలా టీ రెడీ:):)
ReplyDeletenagarjuna:-బా.రా.రే గారి వద్ద కోచింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వకుండానే అంకితం అంటే ఎలాగండి? నేనొప్పనుగాక ఒప్పను:):)
మసాలా టీ నచ్చేసిందిగా:)
ReplyDeleteఇంకా ఏమైనా స్పెషల్ రెసిపీలు వున్నాయా?:)
హ హ హ... నలభీమ పాకశాస్త్ర నిపుణులన్నమాట... బాగుందండీ. మీ శ్రీ వారి నైపుణ్యం.
ReplyDeleteHha..hha...mee all posts supero superr:):)
ReplyDelete