అమ్మ అయినా అత్త అయినా ఈసారి ఆవకాయ నేనే పట్టి పంచి అందరి దగ్గరా మంచి మార్కులు కొట్టెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందే తడువు "ఊరగాయలు-పచ్చళ్ళు" మీద రాసిన గ్రంధాలని అన్నీ తిరగవేసి ఆఖరికి "కాంతామణి వంటలు" అనే పుస్తకంలోని చేయువిధానము ఆవిడ వ్రాసిన ఉపోద్ఘాతము నాకు యమగా నచ్చి అలాచేయాలి అని ఫిక్స్ అయిపోయాను.
ఈయనగారికి చెపితే నీకు ఎందుకు ఆ శ్రమ హాయిగా అమ్మో, అత్తయ్యో పట్టిన పచ్చడిని ఆరగించి ఆనందించక అని నాకు ఒక ఫ్రీ సలహాని పడేసారు. అలాచెప్పిన వెంటనే వింటే ఇలా నా స్మృతి పధంలో "ఆహా ఆవకాయ" చేరేదా చెప్పండి!
ఊరగాయలకి, ఊరమిరపకాయలకి సెలవు ఇవ్వరు అని తెలిసి మా బాస్ మెచ్చి సెలవు ఇచ్చే విధంగా నాలుగు అబద్దాలాడి సెలవు తీసుకుని అటునుండి అటే బజారుకి వెళ్ళి కారంపొడితో పాటు కావలసిన సరుకులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి కాంతామణిగారి వంటల పుస్తకాన్ని మరొక్కసారి చదివి ఒక్కపదం కూడా వదిలివేయకుండా ఆవిడ చెప్పినట్లు అన్నీ సమపాళ్ళలో వేసి పప్పునూనె వేసి చేతితో కలిపి జాడీలోకి ఎత్తుదాం అనుకుని అమ్మ ఎప్పుడో అన్న మాటలు గుర్తుకు వచ్చి వద్దులే అని గరిటతో కలిపి జాడీలోకి ఎత్తి మూడవరోజు(అపార్ధం చేసుకోకండి) కోసం ఎదురుచూసా పచ్చడిని కలిపి అందరికి పంచాలని. ఆరోజు రానే వచ్చింది ఉదయాన్నే తలంటుకుని భగవంతునికి నమస్కరించి ఊరగాయ జాడీని తీసి గరిటతో కలిపితే చక్కని ఎరుపురంగుతో పైన పప్పునూనె తేలుతూ చూడముచ్చటగా వుంది. ఊరగాయజాడీని లాంగ్ షాట్ లో క్లోజప్ లో చూసుకుని మరీ మురిసిపోయాను. ఎందుకు అంత మురిసిపోవడం అంటారా.... మా అమ్మమ్మ చెప్పేది ఊరగాయని కలిపేటప్పుడు తేలిన రంగునిబట్టి దాని రుచి చెప్పవచ్చని, అలా చూస్తే ఇంక నా ఆవకాయ రుచికి తిరుగులేదని తేలిపోయింది కదండి! అదన్నమాట.
ఆదివారం ఆరు హార్లిక్స్ సీసాలను తీసుకుని కడిగి తుడిచి ఆవకాయని అందులోకి తీసి....అమ్మకి, అత్తయ్యకి, పిన్నికి, చెల్లికి, మా ఇద్దరు మరుదులకి ఇచ్చి వారి నుండి కమెంట్స్ కోసం కాటికాడ నక్కలా(ఉపమానం బాగాలేదు కాని ప్రాస కుదిరిందని) ఎదురుచూసాను.
సాయంత్రం ఆరుగంటలకి అమ్మ ఫోన్...అమ్మాయ్ నీకు పుట్టింటి మీద మమకారం కాస్త ఎక్కువేమోనే ఆవకాయ రంగు అదిరింది కానీ అస్సలు కారమేలేదు అంటూ....
ఏడు గంటలకి అత్తయ్యగారు....ఆవకాయలో కారం వేయడానికి బదులు హోలీ రంగు ఏమైనా కలిపావా అంటూ....
పిన్ని...పిచ్చిదానా ఎక్కడో ఏదో పొరపాటు చూసుకోమంటూ....
చెల్లి...నీకు ఈ ప్రయోగాలు ఎందుకే అంటూ....
మరుదులు...మేమింకా రుచి చూడలేదంటూ....
ఆలోచిస్తే***ఆవకాయలో అన్నీ కరెక్టుగానే వేసాను బజారులో కొన్న కల్తీకారంతో పాటు....అది కారం కాదు రంపంపొడిలో రంగు కలిపారని అందుకే దానికి రంగు తప్ప రుచిలేదని. ఆ షాపువాడి దగ్గర డబ్బులు వసూలు చేసాననుకోండి అది వేరేసంగతి. అలా ముగిసింది నా ఆవకాయ పట్టాలన్న ఆలోచన. అప్పటి నుండి ఇప్పటి వరకు మరలా ప్రయత్నించలేదు ఏ ప్రయోగం పచ్చళ్ళపై చేయలేదు.అడుకున్నే వాడికి అరవై కూరల్లాగా....అమ్మ, అత్తయ్య అభిమానంతో ఇచ్చే ఆవకాయతో అటు ఆరు, ఇటు ఆరు నెలలు గడిచి పోతున్నాయండి.
:-)
ReplyDeleteభానుమతి 'అత్తగారూ-ఆవకాయ' తలచుకుంటూ చదివానండీ.. ఉప్పు మర్చిపోయి ఉంటారని ఊహించాను నేను :-)
ReplyDeleteఅవును ఎన్ని కురలున్న ఆవకాయ రుచే వేరు సుమండీ :)
ReplyDelete:) :)
ReplyDeleteకారం మోసం చేస్తే మీరేం చేయగలరండి. :) మీరు సరిగానే కలిపారుగా.
ReplyDeleteమా ఇంట్లో కూడా ఆవకాయ హడవుడి మొదలైందోచ్...
ReplyDeleteమా నానమ్మ,అమ్మ,పిన్ని తెగకష్టపడిపోతున్నారు...
నేను కూడా ఆవకాయ పెట్టేసా.. దొంగ మామిడికాయలతో.అదేదో మామిడికాయలోని రకమనుకునేరు..మా ఇంటి ముందు మామిడి చెట్లు విరగ కాసాయి ..కోద్దామంటే మా వారు ససేమిరా అనేసారు... ఇంకేం చేస్తాం ...ఆయన ఆఫీస్ కి వెళ్ళగానే దొంగతనం గా కోసేసా .. భలే బాగా వచ్చింది :) (అంటే ఉప్పో ,ఏదో కాసింత తగ్గింది అనుకోండి కాని బాన్నే ఉంది )నా పచ్చడి నాకే ముద్దు మరి . .
ReplyDeleteపర్లే ఇంకో ప్రయత్నించి చూడకపోయరా??...ఇందులో మీ తప్పేమి లేదుకదా...కల్తి కారం వల్ల పచ్చడి అలా తయారయింది...ఈసారి మాంచి నిఖార్సయిన మా గుంటూరు కారంతో చెయ్యండి...ఆవకాయ అదుర్స్ అంటారు :)
ReplyDeleteఆవకాయ అదుర్స్:):)
ReplyDeleteమధురవాణి, మురళీగారు,రాధిక, తృష్ణ, శిశిర థ్యాంక్స్ ఫర్ :):):)
ReplyDeleteసంతోష్...ఆ కష్టాన్ని ఇష్టంగా కుమ్మెయ్యండి:)
కిషన్...రిస్క్ తీసుకోవడం అంత అవసరమా చెప్పు?:)
పద్మ...మనం ఏది చేసినా అదుర్సే!:)
Srujana gaaru, meeru comments ki replies lo maa nestham gaarini marchipoyaaru :-(
ReplyDeleteకిషన్ మీరు మరీను....నేస్తాన్ని మర్చిపొలేదు, ఆవిడ బిజీగా వున్నారు కదా ఆవకాయని ఆరగించి ఆనందించడంలో ఎందుకు డిస్టబ్ చేయడం అని ( మనలో మాట..భలే కవర్ చేసాను కదా!):):)
ReplyDeleteనేస్తం క్షమించాలి!
మీ బ్లాగు పేరు నాకు చాలా ఇష్టం. ఆ పేరే నేను పెట్టాలనుకున్నాను. తరువాత "సవ్వడి" అని పెట్టేసాను. ఈ విషయం ఇంతకుముందే చెప్పాను అనుకుంటా.ఇక మీ ఆవకాయ సూపర్
ReplyDeleteఅదిరిందండీ మీ ఆవకాయ్. భానుమతి గారి అత్తగారూ ఆవకాయ్ గుర్తొచింది.
ReplyDeleteసృజన గారూ...,
ReplyDeleteనమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
just start chesaanu mee blog chadavadam .....
ReplyDeleteaa image ni resize(paintlo chesukovachhu) chesi upload cheyandi......then it looks gud.
chala baga chepparu, mumdu urgent ga ippuDu tinali anipistumdi
ReplyDeleteనమస్కారం.
ReplyDeleteమెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి.
సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో సమూహము లింకు ను వుంచి ప్రోత్సహించండి. సమూహము లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి .
దయచేసి మీ సలహను / సూచలను ఇక్కడ తెలపండి మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
-- ధన్యవాదముతో
మీ సమూహము
బాగుంది ఈ ఆవకాయ గోల హ హ హ :-)
ReplyDeleteఅన్ని బాగానే చేసి కారం లేకపోవడం చాల బాదేనండి. ఎంత కల్తి కారమైన కొద్దిగానైనా కారం ఉంటుందిగా?హాస్యం కోసం కల్పితమా? లేక నిజం గా నే కారం లేదా?
ReplyDelete