మా వారికి "ఉత్తమవర్కాలిక్"(పని వ్యసనాపరుడు) అని బిరుదును ఇచ్చి వాళ్ళ ఆఫీసు వాళ్ళు సత్కరిస్తున్నారని లీవ్ దొరికితే రమ్మని చెప్పారు.యధావిధిగా నాకు లీవ్ దొరక్కపోవడం మావారికి నేను రావడంలేదని చెప్పడం అయిపోయింది.అక్కడితో అయిపోతే సృతిగా మిగిలేదికాదు కదండీ....
సరే ఎలాగో వెళ్ళడం కుదరలేదు కనీసం పుష్పగుచ్ఛాన్ని పంపి అయినా నా అభినందనలని తెలియ చెప్పాలనుకుని, మా ఆఫీసు నుండి ఆ ఊరు వెళుతున్న ఒక వ్యక్తికి మావారి ఇంటి అడ్రసు చెప్పి అందమైన పూలగుత్తితో పాటు గ్రీటింగ్ కార్డ్ కూడా విత్ లవ్ అని రాసి పంపించాను.ఆ వ్యక్తి దాన్ని వాళ్ళ క్వాటర్స్ లో మావారి పేరుతోనే ప్రక్కలైన్ లో ఉంటున్న మరొకరికి ఇవ్వడం అందులోను వాళ్ళావిడకు ఇస్తూ మాడం సార్ కివ్వమని పంపారంటూ చెప్పడం జరిగింది.
ఇక్కడ నేను ఈయనగారి నుండి ఎటువంటి సమాధానము రాకపోయేసరికి,అసలు ఈయనకి స్పందించే హృదయమే లేదనుకుని కనీసము థాంక్స్ అన్నా చెప్పలేదు ఇకనుండి మనము కూడా ఏమీ పంపొద్దు అని మంగమ్మశపధం మనసులోనే చేసేసుకున్నాను.రెండువారాల తరువాత మావారు రావడం నేను అలగడం,ఆయన బ్రతిమిలాడడం మధ్యలో అసలు ఏమి అందలేదని ఈయనగారు చెప్పడంతో ఇక్కడ కథ సుఖాంతం అయింది.
మావారి పేరే ఆయనకి వుండడం 41 క్వాటర్ ఈయనది 47 క్వాటర్ ఆయనది అవ్వడం పాపం అక్కడ శాపమైంది. అందులోను వాళ్ళావిడ నెలరోజుల ముందే ఆయనపై అనుమానంతో పుట్టింటికి వెళ్ళితిరిగి వచ్చిందట.....ఈ విషయం మాకు ఆరునెలకి తెలిసింది,కాని అక్కడ అప్పటి సీన్ ఎలావుండి వుంటుందో ఒక్కసారి ఊహించండి మీరు!! ప్చ్.....కొన్ని విషయాలు ఇలా వదిలేస్తేనే బాగుంటాయేమో!!
:) :)
ReplyDelete:)
ReplyDelete:-)) టూ మచ్ కదా..
ReplyDeleteపాపం ఆ 47 వ గది నెం ఆయన...తల్చుకుంటుంటే నవ్వు,జాలి కలగలిపి వచ్చేస్తున్నాయండీ...మొత్తానికి మీ అభినందన ప్రయత్నం ఆయన పాలిట 'కొలంబో' అయిందన్నమాట. :)
ReplyDelete:) :) :)
ReplyDeleteకెవ్వు కేక..
చాన్నాళ్ళ తర్వాత వచ్చి భలే సరదా కబుర్లు చెప్పారు... : ) :)
1000 smiles..
please word verification theeseyyaroo...
www.tholiadugu.blogspot.com
మొత్తానికి సుఖాంతమే కాబట్టి గొడవ తీరిపోయింది. కొంచెం జాగ్రత్తండోయ్. :)
ReplyDeleteపాపం మీరు.....మీవారు!
ReplyDelete