Thursday, October 29, 2009

కార్తీకపున్నమిన......కాంతతో కబుర్లు!

పది అవుతుంది వాళ్ళు వచ్చే టైం అయింది అమ్మాయికి జ్వరం చూస్తే ఇంకా తగ్గలేదు అని అమ్మ అన్నమాటలకి, అంత దూరం నుండి వస్తున్న వారిని కాదంటే ఏంబాగుంటుంది చెప్పు! రానీ చూసి వెళతారు అన్న నాన్న మాటలతో నాకు మెలుకువ వచ్చింది. మెల్లిగా లేచి ఓపిక చేసుకుని ముఖం కడుక్కొని తయారు అయ్యేసరికి వాళ్ళు రానే వచ్చారు. హాల్లో కూర్చున్న వాళ్ళతో నాన్నగారు అమ్మాయికి జ్వరం అని అంటే ఎవరో పెద్దాయిన పర్వాలేదు చూస్తాంలెండి అమ్మాయిని రెండునిముషాలు వచ్చి కూర్చోమనండి అన్నమాటలతో నన్ను హాల్లోకి తీసుకుని వెళ్ళి కూర్చో పెట్టారు. ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు మగవాళ్ళు.... వాళ్ళ ఎదురుగా నేను. రెండు నిముషాల తరువాత లేచి వెళుతూ నూనూగు మీసాలు, నల్ల ప్యాంట్, తెల్ల చొక్కాతో కూర్చున్న పాతికేళ్ళ యువకుడు పదహారేళ్ళ కుర్రాడిలా కనిపించాడు (బహుశా జ్వరం కళ్లకి అలా కనపడి ఉంటారు) ఈయనగారికి ఇప్పుడే పెళ్ళికి తొందరేమిటో అనుకుంటూ ఆయనవైపు ఒక లుక్కిచ్చి లోనికి వెళ్ళాను. నా లుక్కు ఆయనగారికి లైక్ అయినట్టుంది మా మారేజ్ లుక్స్ ఫినిష్, పెళ్ళి డిసెంబర్ నెలలో ఫిక్స్.
ఆరోజు కార్తీకపౌర్ణిమ ఇంట్లో సాయంత్రం నోములకి మధ్యాహ్నం పిండివంటల్లో అమ్మకి సహాయము చేస్తుంటే ఎవరో పాతికేళ్ళ టిప్ టాప్ కుర్రాడు మెయిన్ డోర్ తీసుకుని లోనికి వచ్చి మా గుమ్మం దగ్గర నిలబడి ఏదో అడగబోతుంటే, నేను మా ఇంటి పై పోర్షన్ లో వుంటున్న బ్యాచిలర్స్ కోసం వచ్చిన బాపతు అనుకుని పై వాళ్ళు
వరూ లేరండి అని చెప్పినా ఇంకా ఆ అబ్బాయి అక్కడి నుండి కదలకపోయేసరికి అమ్మ వచ్చి ఎవరు కావాలని అడగడంతో ఆయనగారికి ఏమిచేయాలో తోచక బయటికి వెళుతుంటే, బజారునుండి చెల్లి వస్తూ ఆయనని చూసి మీరా! రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తూ అమ్మకి అతను కాబోయే బావగారు అంటూ గుర్తుచేసింది. అమ్మ తను గుర్తు పట్టలేదని మన్నించమని లోపల కూర్చోమంది. నేను వంటింట్లోకి దూరి పని చేసుకుంటూ అదేవిటి గుర్తుపట్టలేదని కాస్త ఫీలౌతూ ఎలా గుర్తు పడతాను అప్పటికన్నా కాస్త ఒళ్ళుచేసి (నన్ను తలచుకుని) స్మార్ట్ గా ఉంటే అనుకున్నాను. తను ఏదో ఆఫీసు పని మీద వచ్చానంటూ ఎలాగో వచ్చాను కదా చూసిపోదామని ఇలావస్తే ఎవరూ గుర్తుపట్తలేదని చెల్లి దగ్గర వాపోయారు. అసలు విషయం అదికాదని నన్నుచూసి మాట్లాడాలని దానికి ఆఫీసు పని ఒక వంకని వింటున్న అందరికీ తెలుసు. పాపం ఆకోరిక తీరకుండానే పెళ్ళి అవుతుందని ఆ క్షణాన్న అలా చెబుతున్న ఆయనగారికి మాత్రం తెలియలేదు.
ఎందుకంటే రాత్రి పూజ అయ్యేసరికి ఆలస్యం అవటం కతికితే అతకదని కాస్త ప్రసాదం తీసుకుని ఈయనగారు వెళ్ళిపోవటం, వెళుతూ నన్ను పట్టుచీరలో చూసి మైమరచి నా ఆఫీసు అడ్రసు అడగక, తన ఫోన్ నంబర్ ఇవ్వక మరునాడు నా వివరాలు ఎవరినీ అడగలేక బిడియపడడం, నేను ఎలాగైనా కలుస్తారులే అని అఫీసు దగ్గర ఎదురుచూడడం, నన్ను చూడకుండానే ఈయనగారి తిరుగు ప్రయాణం.... వెరసి ప్రతీ కార్తీకమాసంలోను ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడం, ఈ సారి మాత్రం కాస్త వెరైటీగా మీ అందరితో సృజన సృతులని పంచుకోవడం.........

7 comments:

  1. హ హ భలే రాసారు బాగుంది

    ReplyDelete
  2. సృజన గారు, చాలా బాగుంది మీ 'కార్తీక పౌర్ణమి ' అనుభవం. మాతో పంచుకున్నందుకు థాంక్స్. జీవితమంతా నిండు పౌర్ణమి లాగానే వెలిగిపోవాలని నిండు మనసు తో కోరుకుంటున్నాను.

    ReplyDelete
  3. సృజనగారు.... చాలా బాగున్నాయండి మీ సృతులు!

    ReplyDelete
  4. వస్తాడు నారాజు కార్తీకపున్నమి వేళలో అని ఎదురుచూసారన్నమాట !

    ReplyDelete
  5. సృజన గారు బావుందండి....
    పాపం ఓ సారి చూసి పోదాం అని వచ్చి ఎంత ఇబ్బంది పడ్డాడో........

    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  6. aripinchaaru..........chaala chaala bagundandi....

    ReplyDelete