Tuesday, May 12, 2009

థ్రిల్...

నేను వరంగల్ బ్యాంక్, మావారు విజయవాడలో ఉద్యోగం చేస్తున్న రోజులు.... వీలు చూసుకుని ఆయన వచ్చేవారు. ఎప్పుడూ ఆయనే ఎందుకు, ఈసారి నేను వెళ్ళి ఆశ్చర్యపరుద్దాం అనుకుని ఆఫీసులో పరిమిషన్ తీసుకుని బయలుదేరి విజయవాడ చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలైయింది. ఆయన రూంలో కనిపించక పోయేసరికి నాకు సగం నీరసం వచ్చింది, మావారు ఆరోజు సాయంత్రమే వరంగల్ బస్సెక్కారని తెలిసిన నాకు.....పూర్తిగా..... ఏమని చెప్పను!!! ఈసురోమంటూ బస్ట్సాండ్ కి వచ్చి బస్సెక్కి చతికిలపడి వరంగల్ చేరుకునే సరికి ఉదయం 5గంటలు. నా రూమ్మేట్ ఎక్కడికి వెళ్ళావు మీవారూ నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ నాలుగు చివాట్లు పెట్టింది. దానికి నేను విజయవాడ వెళ్ళి ఆయనను థ్రిల్ పరుద్దామనుకున్న విషయము చెబితే జాలిగా నావైపుచూసి... ఎవరిని థ్రిల్ చేసావు అని అడిగింది.
ఇంక ఆయన సంగతి వేరేచెప్పలా చెప్పండి!! నీకు ఎందుకొచ్చిన ఈ థ్రిల్ పాట్లు చెప్పు అంటూ మెత్తగా మందలించారు.
అది మొదలు మేమిద్దరము ఒకే ఊరుకి బదిలీ అయి కలసివున్న ఎక్కడికి వెళ్ళిన ఒకరికొకరం చెప్పుకోకుండా వెళ్ళం...

6 comments:

  1. :)మల్లీశ్వరి సినిమాలో అనుకుంటా ఎం ఎస్ నారాయణ,హేమ ల పరిస్థితి కూడా ఇలానే వుంటుంది.పాపం వాళ్ళకి ఏకంగా ట్రాన్స్ఫర్ లే.అది గుర్తొచ్చింది.

    ReplyDelete
  2. ఆలోచనల్లో కూడా ఒకరికొకరన్నమాట.

    ReplyDelete
  3. రాధికగారు... అప్పుడు బాధపడ్డా ఇప్పుడు మాత్రం తలచుకుని సరదాగా మీ అందరితో పంచుకో గలుగుతున్నానండి నా సృతులని.
    విజమోహన్ గారు...ధన్యవాదాలు, ప్రస్తుతానికి బ్రతికేస్తున్నామండి ఒకరికొకరం తోడుగా.

    ReplyDelete
  4. బాగుంది అండీ మీ టపా. కొన్ని సార్లు థ్రిల్ కూడా మన కొంప ముంచుతుందండీ బాబు..

    ReplyDelete
  5. ఇంతకి ఇప్పుడు మీరుంటున్నది ఓరుగల్లు లో నా లేకా బెజవాడ లో నా సృజన గారు..!

    వరంగల్ ఇప్పుడు చూస్తే బాగా డెవలప్ అయ్యింది లెండి. హన్మకొండ నక్కలగుట్ట కాజిపేట ఇప్పుడు సబర్బన్ సిటిస్.. నేను పుట్టినపుడైతే వీధికో ఇల్లు కనిపించేది.. పాత బృందావనం లో ఒకే ఒక ఇల్లు ఉండే రాజేంద్రప్రసాద్ ఫ్రెండ్ వారి తాతగారి ఇల్లులా..

    ఇప్పుడెక్కడ చూసిన సందడి హడావిడి.. నేను పుట్టిన ఊరు నా ఊరు.. వడ్డేపల్లి చెరువు నుండి భద్రకాళి చెరువు దాకా.. వేయి స్థంబాల ఆలయం నుండి రామప్ప గుడి దాకా.. కాకతీయ శిలాతోరణం నుండి కాకతీయ కిలా దాకా.. తెలంగాణకు పెద్ద పీట వేసిన చారిత్రాత్మక ప్రదేశాల్లో రెండో పురాతన నగరి ఓరుగల్లు అలియాస్ ఏకశిలనగరం.. మొదటిది భాగ్యనగరం..

    ~శ్రీ~

    ReplyDelete