అవి సంక్రాంతి సంబరాల రోజులు....నేను చెల్లెలు కలసి ముగ్గులు వేస్తూ వాటికి రంగులు నింపి అలా కాలనీలో ముగ్గులు చూస్తూ స్నేహితులతో కబుర్లలో నిమగ్నమై ఉండగా అల్లుడుగారు అత్తగారింటికి అడుగిడినారు....ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా! అదేనండి మావారే, మొదటి సంవత్సరం క్యాంటీన్ కాఫీతో కడుపు ఖలాస్ అయింది కదా ఈసారైనా అల్లుడిగారికి ఆతిథ్యంతో అదరగొట్టేయాలనుకున్న అత్తగారి ఆహ్వానాన్ని ఆనందంగా అంగీకరించి భోగి నాడు అరుదెంచిన మా శ్రీవారి అహ్లాదకరమైన అనుభవమన్నమాట.....
అడుగిడిన అల్లుడిగారు అత్తగారి పలకరింపుల అనంతరం స్నానానికి వెళుతూ, నేను కనపడలేదన్న కలవరమో, ముంగిట నేను వేసిన ముగ్గులని చూసిన పరవశమో లేక ఎవరిని అడగాలి అన్న మొహమాటమో కాని అక్కడ తాడుపై వేసిఉన్న టవల్ ని కట్టుకుని బాత్రూంలోకి దూరిన గంటకి కూడా బయటికి రాలేదు.......ఇక్కడ బయట అమ్మ ఇంతసేపు అల్లుడుగారు లోపల ఏం చేస్తున్నారో అనుకుంటూ ఇంకా ఇంటికి రాకుండా ఏం పెత్తనాలు వెలగబెడుతున్నారో వీళ్ళు అని మనసులో మమ్మల్ని తిట్టుకుంటున్న అరగంటకి అరుదెంచిన మాకు అమ్మ చెప్పిన విషయానికి ఆత్రుతగా పెరట్లోకి వెళ్ళి తలుపు కొట్టిన నాకు టవల్ కాస్త నా మొహాన్న పడేయమన్న ఈయనగారి విసుగుతో కూడిన స్వరం విని టవల్ అందించాక నాకు అసలు విషయం కొంచం అర్థమైంది మిగిలినది మావారు వినిపించారు.
అత్తారింటికి వస్తున్న ఆనందంలో కాదులెండి నన్ను చూడాలన్న ఆత్రుతలో అదీ కాదు మరదళ్ళతో ముచ్చటించాలన్న మురిపంలో తాళాలని, పర్స్ ని ఓ జేబుదొంగకి సమర్పించి తాళం వేసిన సూట్ కేస్ తో వచ్చారు. ఇక్కడ నేను కనపడపోయేసరికి మొహమాటానికి పోయి పెరట్లో తాడుపై వున్న టవల్ ని తీసుకుని బాత్రూంలోకి దూరి టవల్ విప్పి తలుపుపైన వేసారు లోపల ఈయన ఉన్నవిషయం తెలియని పనిమనిషి అది ఉతకవలసిన టవల్ అని తీసుకుని వెళ్ళి నానపెట్టేసింది. స్నానం చేసి బయటికి రావాలంటే టవల్ లేదు, అప్పటికీ రెండుసార్లు ఈయనగారు అరచినది అత్తగారికి పని హడావిడిలో వినపడలేదు, అమ్మ అల్లుడిగారిని అడిగితే బాగుండదని అడగలేదు.....దాని పర్యవసానం మావారు బాత్ రూం లో గంటన్నర ఒంటికాలిపైన జపం అన్నమాట....
తరువాత........ ఏముంటుందండి సూట్ కేస్ తాళాలని బ్రద్దలకొట్టి డ్రెస్ వేసుకునే వరకు టవల్ కట్టుకుని టాలీవుడ్ సల్మాన్ ఖాన్ లెవల్ లో మరదళ్ళకి ఫోజ్ ఇచ్చారన్నమాట....
మరచిపోలేని అనుభవమన్నమాట మీవారికి. :)
ReplyDeleteLOL ... పాపం ఆయన మరదళ్ళు మంచివాళ్ళలానే ఉన్నారే, మా మరదళ్ళు మహా కోతులు - ఆ పరిస్థితిలో నేనుంటే రోజంతా బాత్రూం లోనే నిలబెట్టుండేవారు :))
ReplyDeleteబావుంది .... మీ సల్మాన్ ఖాన్ ని అడిగానని చెప్పండి ....:)
ReplyDeleteటాలివుడ్ సల్మాన్ ని చూసికూడా వదిలేసారన్నమాట...పిచ్చి మరదళ్ళు:)
ReplyDelete>టాలీవుడ్ సల్మాన్ ఖాన్ లెవల్ లో మరదళ్ళకి ఫోజ్ ఇచ్చారన్నమాట....
ReplyDeleteఒంటి మీద కప్పుకోవడానికి, పెద్ద తువ్వాలు కూడా ఇవ్వలేదన్నమాట?
ఏదేమైన మీరు పెట్టిన పేరు బాగుంది. అప్పట్లొ యండమూరి రాసిన తప్పు చేద్దాం రండి నవల పేరు గుర్తుకు వచ్చింది.
ReplyDeleteనేను ఆ నవలలొ చదివిన మొదటి వాక్యం "తప్పు చేద్దాం రండి అని పేరు చదివి తప్పుగా ఆలొచించడం మీరు చేసే మొదటి తప్పు. " నిజానికి నేను తప్పుగానే ఆలొచించాను. ఇప్పుడు కుడా అలానే ఆలొచించి చదివాను.
మీకు,మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteసంక్రాంతి శుభాకాంక్షలు .
ReplyDeleteపాపం సల్మాన్ ఖాన్ !!!
మీ టెంప్లెట్ సూపర్ .
haha...bagundi anubhavam..
ReplyDeleteఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
ReplyDeleteఅందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html
హ హ మొహమాటాలు ఎంత పని చేస్తాయో కదా :-) బాగుంది.
ReplyDeleteబాగుందండి, మొత్తనికి మీ సంక్రాంతి అనుభవం. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteha ha... good fun... bagundhi....
ReplyDeleteపాపం సల్మాన్ ఖాన్ గారు ఈ పండగ మర్చిపోరన్నమాట...
ReplyDeleteala jarigindanna mata..bavundi mee kadhanam.
ReplyDeleteమొత్తానికి కొత్తల్లుడికి భలే మర్యాదలు చేశారే మరదళ్ళు ;) ;)
ReplyDeleteమీరు భలే సరదా సంఘటనలు చెప్తుంటారండీ సృజన గారూ :)
meeru chala lucky andi..anni chaala baaga gurtu chesukoni....enjoy chestunnaru
ReplyDelete