స్మృతులు ఏమీ రాయడంలేదు ఎందుకు సృజనా???? అని మీరు అడక పోయినా మా శ్రీవారు మాత్రం నన్ను అమ్మడూ... అమ్మడూ..... నీ ఆరాటం ఏమైనది? నీలోని రచనావేశం చల్లబడినదంటూ ఆటపట్టిస్తున్నారుకదా ఎడాపెడా రాసేద్దామని ధృడసంకల్పంతో కంప్యూటర్ ముందు కూర్చుని థింకింగ్.....థింకింగ్!!!!!!! బట్ నాట్ గెట్టింగ్ థాట్స్:-) :-) టీవీ చూస్తూనే మావారు హాయిగా గురక పెడుతూ స్లీపింగ్. గుర్ ర్ ర్ ర్ .......
గుర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్
గుర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్
ఒరేయ్ వెధవ.... నీకు బుర్రలేదురా! ఎన్నిసార్లు చెప్పినా ఒక్కపనీ సరిగ్గా చేయవు నిన్ను.....నిన్ను....ఐ విల్ కిల్ యూ............కిల్ యూ.........యూ
హా హా హా (వికటహాసం).
ఇదీ మావారు గురక పెడుతూ మధ్యలో కలవరిస్తున్న డైలాగ్స్,...
(టీవీలో హారర్ సినిమాలను చూస్తూ నిద్రపోతూ ఆఫీసు విషయాల గురించి ఆలోచించడం వలన వచ్చిన ఎఫెక్ట్స్)
ప్చ్ ప్చ్ పాపం అనుకోకండి....
ఇవి నాకు అలవాటే టికట్టు లేకుండా హాయిగా థియేటర్ లో అర్థం కాని ఇంగ్లీష్ సినిమాలని మావారి కలవరింతల నైపుణ్యంతో రీమిక్స్ కావించబడి స్పెషల్ గురకల సౌండ్ ఎఫెక్ట్స్ తో ఎంజాయ్ చేస్తుంటాను.
అప్పుడప్పుడూ బాగున్న ఈ కలవరింతలుకూడా మా పెళ్ళైన కొత్తలో కలంకం సృష్టించాయండోయ్!!!!!!!
ఏమా కలంకం?
ఏమా కథా????
అని మీరు అడకపోయినా నేను మీకు సీరియల్ రూపంలో ఇంకోసారి తెలుపుకుంటానుగా......
ప్రస్తుతానికి సెలవు:-) :-)