లాంగ్ లాంగ్ ఎగో అప్పుడెప్పుడో........స్నాక్స్ ఏమైనా వేడివేడిగా చేసి పెట్టొచ్చుకదా చక్కగా చినుకులు పడుతుంటే కిటికీలో నుండి చూస్తూ తింటాను అని కోరక కోరక కోరిన కోరికని కాదంటే......భార్యా భాధితుల సంఘాలన్ని స్నాక్స్ నిరహారదీక్ష చేసి నాకు "అప్రతివత" అన్న బిరుదును ఎక్కడ అంటగట్టేస్తారో అని అలోచించా.....లోచించా......చించా!
చివరికి ఓ కొంగ్రొత్త వంటను మావారి చేతికందించి కంచిపట్టుచీరను కోరడం కామన్ అని తలచి కాపర్ కలపని KDM కడియం ఒకటి కోరాలని కార్యక్రమనికి క్లవర్ గా మొదలుపెట్టా....
సూక్ష్మంలో మోక్షం తెలిసిన తెలివైన భార్యని కదా....... గోధుమపిండిలో కూసింత మైదా ఇంకా పనిలో పనిగా రాగిపిండి బియ్యప్పిండిని కూడా కలిపేసి చిటికెడు ఉప్పువేస్తుంటే......ఛస్ ఇదేం వంటకం అనుకుని బెల్లం డబ్బా అందుకుని నా గుప్పెడంత గుండె సైజ్ లో బెల్లాన్ని పిండిలో వేసి కలిపాను తియతీయగా ఉప్పు ఉప్పగా అందిస్తే అదుర్స్ అని........(అసలు విషయం మావారిపై ప్రేమ తీపిపాళ్ళు ఎక్కువని మరోగుప్పెడు బెల్లాన్ని చేర్చి పిండిని కలుపుతూ కడియమున్న నా చేతిని నేనే ఊహించుకున్నాలెండి) వంటలోకి వెళితే ఏముంది.....పిండికాస్త సాంబార్ కన్నా కాస్త చిక్కగా ముద్దపప్పుకన్నా పలుచగా తయారైంది. అయ్యో అని వ్యర్థం చేయడం నా ఇంటా వంటా లేదని......వేడిగా కాగిన నూనె బాణాలిలో నూనెలో గుంటగరిటేతో వడియాలలా వేసేసరికి అవి పరవశంగా "పుస్స్ పుస్స్" మని పొంగాయి. ఆ తరువాత????????
ప్లేట్ లో అందంగా అమర్చి మావారికి నవ్వుతూ అందిచేసరికి ఆహా ఓహో.....అమోఘం మా ఆవిడ అడగ్గానే అదేదో చేసివ్వడం అని తినబోతుంటే వర్షం ఆగిపోయి కరెంటు పోయింది.
ప్చ్ :-( .......ఇంకేం మావారి ఫేస్ ఎక్ప్రెషన్స్ చూడను, KDM కడియం కావాలని కోరను?
అలా ముగిసింది ఆనాటి జ్ఞాపకం!